మహారాష్ట్రలోని పూణే-సోలాపూర్ హైవే పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నా కారు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి  చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  మృతులు పూణేకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.లారీ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.