Asianet News TeluguAsianet News Telugu

8 నెలల చిన్నారికి హెచ్ఐవీ రక్తం.. మహారాష్ట్రలో దారుణం..

చిన్నారికి రెండు నెలల క్రితం తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుల సూచన మేరకు అకోలా లోని బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కించారు.  ఆ తర్వాత  చిన్నారి కోలుకున్నా మళ్ళీ కొన్నాళ్లుగా తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంది.  దీంతో చిన్నారిని అమరావతి లోని ఓ ఆసుపత్రిలో చూపించారు.

Maharashtra : 8-month-old girl infected by HIV after receiving blood in Akola; probe ordered
Author
Hyderabad, First Published Sep 3, 2021, 11:11 AM IST

ముంబయి : ఓ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు నిర్లక్ష్యంతో చేసిన తీవ్ర తప్పిదం 8 నెలల పసికందు పాలిట శాపంగా మారింది.  హెచ్ఐవీ ఉన్న రక్తం ఎక్కించడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారికి ప్రాణాపాయం ఏర్పడింది. ఈ దిగ్భ్రాంతికర సంఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో చోటు చేసుకుంది.  దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 

సదరు చిన్నారికి రెండు నెలల క్రితం తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుల సూచన మేరకు అకోలా లోని బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కించారు.  ఆ తర్వాత  చిన్నారి కోలుకున్నా మళ్ళీ కొన్నాళ్లుగా తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంది.  దీంతో చిన్నారిని అమరావతి లోని ఓ ఆసుపత్రిలో చూపించారు.

పాపకు వేరే అనారోగ్య లక్షణాలు లేకపోవడంతో అనుమానించిన వైద్యులు హెచ్ఐవి పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులకు హెచ్ఐవి పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు వారిని ఆరా తీయగా రక్తం ఎక్కించిన విషయాన్ని వెల్లడించారు.  

ప్రతి బ్లడ్ బ్యాంకులో నుంచి రక్తాన్ని స్వీకరించే ముందు హెచ్ఐవీ సహా అన్ని రకాల పరీక్షలు చేయాలని నిబంధనలు ఉన్నాయని పాపకు బ్లడ్ బ్యాంక్ నుంచి హెచ్ ఐవీ రక్తం ఎలా వచ్చిందన్నది తెలియాల్సి ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.దీనిపై  మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇ రాజేష్ తో పే వైద్యాధికారులను ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios