ప్రయాగరాజ్ కుంభమేళాలో బిజెపి ఎంపీ శివతాండవం చేస్తారట... ఎవరాయన?

సినీ నటుడు, బిజెపి ఎంపీ రవి కిషన్ జనవరి 13న ప్రయాగరాజ్ కుంభమేళాలో శివతాండవం చేయనున్నారు. గత కుంభ్‌లో కూడా ఆయన శివతాండవం చేశారు,  

Mahakumbh Mela 2025 Prayagraj Ravi Kishan Shiva Tandav Hindu Organizations BJP Appeal AKP

మహాకుంభ్ మేళా 2025 : ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభోత్సవానికి అంతా సిద్దమైంది. సంగమ నగరి లక్షలాది మంది జనాాలతో నిండిపోనుంది. ఇక్కడ ప్రజల బస, పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యువతను ఈ మతపరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి హిందూ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం బిజెపి కూడా ప్రయత్నిస్తోంది. ఈ పార్టీ ఎంపీ రవి కిషన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యువత కుంభమేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు.య

రవి కిషన్ శివతాండవం 

రవి కిషన్ బిజెపి ఎంపీ మాత్రమే కాదు ప్రముఖ సినీ నటుడు. అతడికి నటనతో పాటు నాట్యంలో మంచి ప్రావిణ్యం వుంది. ఈ క్రమంలో అతడు కుంభమేళాలో శివతాండవం చేయనున్నారు. జనవరి 13న ప్రయాగరాజ్ ఈ కార్యక్రమం వుంటుంది. శివతాండవంతో పాటు శివ పారాయణం కూడా చేస్తానని ఆయన చెప్పారు.కుంభమేళాలో శివతాండవం చేసేటప్పుడు తనకు భోళా శంకరుడితో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని రవి శంకర్ పేర్కొన్నారు.

కుంభమేళాకు అద్భుత ఏర్పాట్లు

రవి కిషన్ మహాకుంభ్ గురించి పాత విషయాలు గుర్తు చేసుకున్నారు. మేము బ్రాహ్మణులం... నాన్నగారు పూజలు చేసేవారు. ఇంట్లో ఎప్పుడూ మతపరమైన వాతావరణం ఉండేది. మేము చిన్నప్పుడు కుంభ్ సమయంలో గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో కుంభ్‌లో చాలా అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. అయితే గంగా స్నానంతో అన్ని ఇబ్బందులు తొలగిపోయేవన్నారు.

ఇప్పుడు ఈ మేళా చాలా ఆధునికంగా మారింది. ఈసారి మనం సంగమంలో స్నానం చేసినప్పుడు స్వచ్ఛమైన నీటి ప్రవాహంలో మోక్షం పొందుతాం. యువత కుంభ్ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ఇక్కడికి రావాలని నటుడు విజ్ఞప్తి చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios