ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా సందడి షురూ..: జూనా అఖాడా సాధువుల నగర ప్రవేశం

వచ్చే ఏడాది 2025 జనవరిలో మహా కుంభమేళా ప్రారంభంకానుంది... మరో రెండునెలల సమయం వున్నా ఇప్పటినుండే ప్రయాగరాజ్‌లో సందడి మొదలయ్యింది. జూనా అఖాడా ఘనంగా నగరంలోకి ప్రవేశించింది.  

Mahakumbh 2025 Juna Akhada Enters Prayagraj Kumbh City AKP

మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగరాజ్‌లో సందడి మొదలయ్యింది. జనవరి 2025లో అంటే మరో రెండు నెలల సమయం వుంది కుంభమేళా ప్రారంభంకావడానికి.. కానీ ఇప్పటినుండే భారీగా సాధువులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 13 అఖాడాల నగర ప్రవేశం మొదలైంది... శ్రీపంచదశనామ్ జూనా అఖాడా ఘనంగా నగరంలోకి ప్రవేశించింది. యోగి ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణకు తీసుకున్న సంకల్పం నగర ప్రవేశ యాత్రలో స్పష్టంగా కనిపించింది.

సనాతన ధర్మ ప్రచారానికి జూనా అఖాడా నగర ప్రవేశం

త్రివేణి సంగమ తీరంలో జరగనున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు అఖాడాలు నగరంలోకి చేరుకోవడం మొదలైంది. సన్యాసులతో కూడిన శ్రీ పంచదశనామ్ అఖాడా  వైభవంగా నగరంలోకి ప్రవేశించింది. నగరానికి వెలుపల ఉన్న రామాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం నుంచి తమ రమతా పంచతో అఖాడా సన్యాసులు, మహాత్ముల ఘన నగర ప్రవేశ యాత్ర మొదలై నగరంలోని జూనా అఖాడా మౌజ్ గిరి ఆశ్రమంలో ముగిసింది.

నగర ప్రవేశ యాత్రలో అఖాడా మహాత్ములకు కుంభమేళా అధికారులు పూలతో స్వాగతం పలికారు. వెండి సింహాసనంపై వచ్చిన అఖాడా మహామండలేశ్వరులపై స్థానికులు పూల వర్షం కురిపించారు. అఖాడా సాధువులు ఇక్కడే బస చేస్తారు. డిసెంబర్ 14న జూనా అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ గిరి నేతృత్వంలో అఖాడా కుంభ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.

అఖాడా నగర ప్రవేశ యాత్ర సజావుగా సాగేందుకు మహాకుంభ్ అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. అదనపు కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది నేతృత్వంలో రామాపూర్ నుంచి అధికారుల బృందాలు అఖాడా సాధువులతో పాటు వెళ్లారు. మార్గంలో రాకపోకలు సజావుగా సాగేందుకు నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, 6 మంది ఇన్స్పెక్టర్లు, 9 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 40 మంది పోలీసులు విధులు నిర్వర్తించారు. జిల్లా పోలీసులు వేర్వేరు మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. నగర ప్రవేశ యాత్రలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు.

విదేశీ సాధువుల ప్రశంసలు

శ్రీ పంచదశనామ్ జూనా అఖాడా నగర ప్రవేశ యాత్రలో వెయ్యిమందికి పైగా సాధువులు పాల్గొన్నారు. యాత్రలో మాతృశక్తి కూడా పాల్గొంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా మహామండలేశ్వరులు కూడా యాత్రలో పాల్గొన్నారు.

నేపాల్ నుంచి వచ్చిన మహిళా సాధువు, జూనా అఖాడా మహామండలేశ్వర్ హేమ నంద్ గిరి మాట్లాడుతూ.. మహాకుంభ్ జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాధువు కావడం సాధువుల అదృష్టమని అన్నారు. యోగి ఆధ్వర్యంలో భవ్య, దివ్య మహాకుంభ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటంతో నేపాల్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో సనాతన ధర్మ ప్రచారం వేగంగా జరుగుతోందని అన్నారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios