ప్రతి ఘాట్ వద్ద పూల వర్షం 5 నుండి 6 రౌండ్లుగా జరిగేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. భక్తులు పవిత్ర అమృత స్నానం చేసే వేళ ఉదయం 6:30 నుండి 7:00 మధ్య మొదటి రౌండ్ ప్రారంభం కానుంది.  

మహాకుంభ్ 2025 సందర్భంగా మౌనీ అమావాస్య పర్వదినాన, యోగి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పది కోట్ల మంది భక్తులను ఆత్మీయంగా గులాబీ రేకుల వర్షంతో స్వాగతించనుంది. అమృత స్నాన మహోత్సవానికి ఆధ్యాత్మిక శోభను చేర్చుతూ, ఆకాశం నుండి పూల వర్షం భక్తులకు అపూర్వ అనుభూతిని అందించనుంది అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ప్రతి ఘాట్ వద్ద పూల వర్షం 5 నుండి 6 రౌండ్లుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పవిత్ర అమృత స్నానం చేసే వేళ ఉదయం 6:30 నుండి 7:00 మధ్య మొదటి రౌండ్ ప్రారంభం కానుంది.

విశాల జనసందోహానికి సన్నాహాలు చేయడంలో భాగంగా, యోగి ప్రభుత్వం 25 క్వింటాళ్ల గులాబీ రేకుల్ని సిద్ధం చేసింది. అదనంగా మరో ఐదు క్వింటాళ్లు సిద్ధంగా ఉంచారు. ప్రయాగరాజ్ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణ మోహన్ చౌదరి పూల వర్షం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మహాకుంభ్ పూల వర్షానికి బాధ్యత వహిస్తున్న హార్టికల్చర్ ఇన్‌ఛార్జ్ వి.కే.సింగ్, "ఒక్కో రౌండ్ కోసం పూలను జాగ్రత్తగా సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత దివ్యంగా మార్చేందుకు ప్రత్యేకంగా చేపట్టారు," అని అన్నారు.

మరోవైపు, మౌనీ అమావాస్య రోజున రెండవ షాహీ స్నానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 80-100 మిలియన్ మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరిన్ని ముఖ్యమైన స్నానాల తేదీలు ఫిబ్రవరి 3 (వసంత పంచమి - మూడవ షాహీ స్నానం), ఫిబ్రవరి 12 (మాఘ పౌర్ణమి), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) అని తెలిపారు.

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించబడే మహాకుంభ్ ఈవెంట్ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత పరంగా ఎంతో ముఖ్యమైన ఈ ఈవెంట్ 450 మిలియన్ మందికి పైగా భక్తులను ఆకర్షించే చారిత్రాత్మక సంఘటనగా ఉండబోతుంది.

మొత్తానికి యోగీ ప్రభుత్వం ప్రతి భక్తుడినీ మోదీలాగా భావిస్తోందన్నమాట