మహాకుంభ్ 2025లో జల పోలీసులతో భద్రత ... అత్యాధునిక పరికరాలతో సంసిద్దం

2025 మహా కుంభమేళాలో భక్తుల భద్రత కోసం జల పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అత్యాధునిక సామగ్రి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సంగమ తీరంలో భద్రతను పటిష్టం చేస్తున్నారు.

Maha Kumbh 2025 Water Police Deployment Ensures Devotee Safety AKP

మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు వచ్చే కోట్లాది మంది భక్తుల భద్రత యోగి ప్రభుత్వం భాద్యత. ఈ క్రమంలోనే గంగా, యమునా నదుల వద్ద భద్రత, నిఘా కోసం పెద్ద సంఖ్యలో జల పోలీసులను మోహరించారు. అత్యాధునిక పరికరాలను కూడా వీరికి అందించారు. అండర్ వాటర్ డ్రోన్లు, సోనార్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో సంగమ తీరాన్ని జల పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లైఫ్‌బాయ్‌లు, ఎఫ్‌ఆర్‌పి స్పీడ్ మోటార్ బోట్లు వంటివి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. ఏ విధమైన ప్రమాదాన్ని అయినా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన జల పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

పెద్ద సంఖ్యలో జల పోలీసులు

జల పోలీసుల ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 2500 మంది పోలీసులను తీర భద్రత కోసం మోహరించారు. మూడు జల పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇవి భక్తుల భద్రత కోసం 24 గంటలూ పనిచేస్తాయి. జల పోలీసుల కంట్రోల్ రూమ్ నుంచి తీర భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మేళా ప్రాంతంలో 17 జల పోలీసుల కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. మేళా ప్రారంభానికి ముందు ఈ సిబ్బంది సంఖ్యను మరింత పెంచుతారు. దాదాపు 1300 మంది జల పోలీసులను అదనంగా నియమిస్తారు. మేళా సమయంలో మొత్తం 3800 మంది జల పోలీసులు తీర భద్రతను చూసుకుంటారు.

తీర భద్రత కోసం యోగి ప్రభుత్వం జల పోలీసులకు అత్యాధునిక పరికరాలను అందించింది. 8 కి.మీ. పరిధిలో డీప్ వాటర్ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. రెండు ఫ్లోటింగ్ రెస్క్యూ స్టేషన్లను ఏర్పాటు చేసి, అక్కడ సిబ్బందిని మోహరించారు. సంగమ ప్రాంత భద్రత కోసం 11 ఎఫ్‌ఆర్‌పి స్పీడ్ మోటార్ బోట్లను ఏర్పాటు చేశారు. 6 సీట్ల ఈ బోట్లలో పోలీసులు సంగమ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం 4 వాటర్ అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. 25 రీఛార్జబుల్ మొబైల్ రిమోట్ ఏరియా లైటింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లతో 4 భారీ మోటార్ బోట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అత్యవసర ప్రణాళిక

2 కి.మీ. పొడవైన రివర్ లైన్‌ను కూడా జల పోలీసులకు అందించారు. ఇది యమునాలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. 100 డైవింగ్ కిట్లు, 440 లైఫ్‌బాయ్‌లు, 3 వేలకు పైగా లైఫ్ జాకెట్లు, 415 రెస్క్యూ ట్యూబ్‌లు, 200 థ్రో బ్యాగ్‌లు, 29 టవర్ లైట్ వ్యవస్థలు, ఒక అండర్ వాటర్ డ్రోన్, ఒక సోనార్ వ్యవస్థ వంటివి కూడా వీరి వద్ద ఉన్నాయి. ఈ అత్యాధునిక పరికరాలతో జల పోలీసులు తీర భద్రతతో పాటు నీటిలో జరిగే ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించగలుగుతారు.

మహాకుంభ్ ఉత్తరప్రదేశ్ జల పోలీసులు, పిఎసి, ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు గొప్ప అవకాశం. సంగమం, ఇతర ప్రాంతాల భద్రత, నిఘా మనందరి బాధ్యత. భక్తుల భద్రత కోసం ప్రభుత్వం జల పోలీసులు, పిఎసికి అత్యాధునిక పరికరాలను అందించింది. తగినంత మానవ వనరులను కూడా అందుబాటులో ఉంచింది. మహాకుంభ్‌ను పూర్తిగా 'సంఘటనలు లేని' మేళాగా మార్చడమే మా లక్ష్యం.

-డాక్టర్ రాజీవ్ నారాయణ్ మిశ్రా, ఇన్‌ఛార్జ్ పోలీస్ మహానిరీక్షకుడు, పిఎసి తూర్పు జోన్, ప్రయాగరాజ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios