ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయడంతో ఒకింత చల్లబడ్డాయి. శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ల కూటమి అనూహ్యంగా అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు...దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యింది. 

కేవలం 6గురితో మాత్రమే ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, పూర్తి కాబినెట్ విస్తరణకు నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎవరెవరు ఈ లిస్టులో ఉంటాటారనే చర్చ వాడి వేడిగా సాగుతుంది.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఎన్సీపీ నేత, శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు. ఆయన హోమ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. 

Also read: 'మహా' రాజకీయాలు: అందరి చూపూ పంకజ ముండేపైనే...

ఇక ఠాక్రేలు కుటుంబం నుండి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెల్చిన ఆదిత్య ఠాక్రే కూడా తన తండ్రి కేబినెట్ లో ప్రమాణస్వీకారం చేయనున్నాడు. మరో ముఖ్యనేత ధనంజయ్ ముండే ఆర్ధిక, ప్లానింగ్ శాఖలనుచేపట్టనున్నారు.

జయంత్ పాటిల్ నీటిపారుదల మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన నుంచి ఎన్సీపీలో చేరిన ఓబీసీ సీనియర్ నేత చాగం భుజ్ బల్ కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించనున్నారు. 

ఇక మరో నేత జితేంద్ర అవాద్ కు సామాజిక న్యాయ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తుంది. రాజు శెట్టి, బచ్చు కదూ లకు కూడా మంత్రిపదవులు దక్కనున్నాయి. వీరు రైతు నేతలుగా చాలా గుర్తింపు పొందినవారు. ఒకరకంగా రైతు ఉద్యమాల నేపథ్యంలోనే వీరు రాజకీయాల్లోకి వచ్చారు. 

Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

ఇక కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, పద్వీ, విజయ్ వాడెట్టివారు అమిత్ దేశ్ ముఖ్,సునీల్ కేడర్, యశోమతి ఠాకూర్, వర్ష గైక్వాడ్,అస్లాం షేక్,సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్ లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.