Asianet News TeluguAsianet News Telugu

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం: తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు

అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 భూకంప తీవ్రత గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

Magnitude 6.1 Earthquake Strikes Near Andaman and Nicobar Island lns
Author
Andaman & Nicobar Islands Institute of Medical Sciences, First Published Aug 3, 2021, 11:33 AM IST


పోర్ట్‌బ్లెయిర్: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మంగళవారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది. పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని యూరోపియన్ -మధ్యధరా భూకంప కేంద్రం మంగళవారంనాడు ప్రకటించింది. భూమి లోపల సుమారు 40 కి.మీ లోతులో భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు రాలేదు. ఈ విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మణిపూర్ లో సోమవారం నాడు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మణిపూర్లోని మెయిరాంగ్‌కి 49 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి.  ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా రికార్డౌతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios