ఉత్తర భారతదేశంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు ఛండీగఢ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాతో పాటు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌లో భూమి కంపించింది.

రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఒక్కసారిగా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.