న్యూఢిల్లీ: అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. బీహార్ లోని పాట్నాలో, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. 

అస్సాంలోని భూకంపం రెక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. భూకంపం 15 నుంచి 20 సెకన్ల వరకు కుదిపేసింది. ఉదయం 10.20 గంటలకు భూకంపం వచ్చింది. అస్సాంలోని కోక్రాజిల్లాలో 13 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది.