మధురై: 165 రోజుల తర్వాత మధురై మీనాక్షి అమ్మన్ దేవాలయం మంగళవారం నాడు తెరుచుకొంది. ఆన్ లాక్ -4 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఈ దేవాలయాన్ని ఇవాళ తెరిచారు.

165 రోజుల తర్వాత ఆలయాన్ని తెరవడంతో అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇవాళ భారీ ఎత్తున ఆలయానికి వచ్చారు. దేవాలయంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్ ను ప్రజలకు అందించారు. మరోవైపు టెంపరేచర్ ను కూడ తనిఖీచేసిన తర్వాతే భక్తులను అనుమతి ఇచ్చారు.

పదేళ్లలోపు పిల్లలతో పాటు గర్భిణీలు, 60 ఏళ్లపై బడిన వారిని  దేవాలయంలోకి అనుమతి ఇవ్వడం లేదు. కరోనా వైరస్ నివారణకు గాను ఎలాంటి ఆహార పదార్ధాలను దేవుడికి సమర్పించేందుకు గాను ఆలయ కమిటి అనుమతించడం లేదు.భౌతిక దూరం పాటిస్తూ దేవాలయంలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం అనుమతి ఇచ్చింది దేవాలయ కమిటి.ఆన్ లాక్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తిరుపతి దేవాలయంలో భక్తులకు అనుమతి ఇచ్చారు. 

షీర్డీలో సాయిబాబా దేవాలయాన్ని తెరవాలని కోరుతూ ఇటీవల కాలంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.