Madras High Court: భర్త తన పేరున సంపాదించిన ఆస్తులన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో భార్య చేసే పనిని భర్త ఎనిమిది గంటల ఉద్యోగంతో పోల్చలేమని హైకోర్టు పేర్కొంది.
Madras High Court: భార్య ప్రతి పనిలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుందనీ, ఆమె ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేయనప్పటికీ, పిల్లల సంరక్షణ, వంట చేయడం, శుభ్రపరచడం,కుటుంబ రోజువారీ వ్యవహారాలను నిర్వహించడం వంటి ఇంటి పనులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మద్రాసు హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా.. ఆమె (భార్య) తన కలలను త్యాగం చేసి, కుటుంబం, పిల్లల కోసం తన జీవితమంతా గడుపుతుందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఇలా బాధ్యతల్ని చూసుకునే భార్యకు భర్త ఆస్తిలో హక్కులు, వాటాలు ఉంటాయని మద్రాస్ హైకోర్టు తాజాగా ఓ కేసు తీర్పులో స్పష్టంచేసింది.
వివరాల్లోకెళ్తే.. తమిళనాడుకు చెందిన అమ్మాల్ అనే ఓ మహిళ మరణించిన తన భర్త పేరుతో ఉన్న ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖాలు చేసింది. ఆ పిటీషన్ ను విచారించిన జస్టిస్ రామస్వామి కీలక తీర్పునిచ్చారు. ఆమెకు అన్ని ఆస్తుల్లోనే వాటా ఉంటుందని తేల్చి చెప్పారు. భర్త కొనే ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని, భార్య పోషించే వివిధ పాత్రలను భర్త ఎనిమిది గంటల ఉద్యోగానికి తగ్గించలేమని జస్టిస్ రామస్వామి వ్యాఖ్యానించారు. భర్త కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకు సమాన వాటా ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో భార్య చేసే పనిని భర్త ఎనిమిది గంటల ఉద్యోగంతో పోల్చలేమని హైకోర్టు పేర్కొంది.
ఆమె (భర్త) నేరుగా ఆర్థిక సహాయం చేయనప్పటికీ, పిల్లల సంరక్షణ, వంట చేయడం, శుభ్రపరచడం , కుటుంబ రోజువారీ వ్యవహారాలను నిర్వహించడం ద్వారా ఆమె ఇంటి పనులలో కీలక పాత్ర పోషిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మహిళ గృహిణిగా ఎన్నో పనులు చేస్తుందని న్యాయమూర్తి అన్నారు. ఆమె మేనేజర్, కుక్, హోమ్ డాక్టర్ , ఆర్థిక నైపుణ్యాలు కలిగిన గృహ ఆర్థికవేత్త కూడా. భార్య సౌకర్యవంతమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించి కుటుంబానికి సహకరిస్తుంది. ఆమె పనికి విలువ కట్టలేం.. ఆమెది సెలవులు లేని 24 గంటల పని, అదే సమయంలో భార్య చేసే పనిని భర్త ఎనిమిది గంటల ఉద్యోగంతో పోల్చలేమని న్యాయమూర్తి అన్నారు.
సాధారణంగా పెళ్లయిన తర్వాత భార్య పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లలను పెంచి పెద్దచేసి ఇంటిని చూసుకుంటుంది. ఆ విధంగా ఆమె తన ఆర్థిక కార్యకలాపాల కోసం తన భర్తను విడిపిస్తుంది. భర్త తన పనిని చేయగలిగేలా చేసుందని అన్నారు. భార్యాభర్తలు కుటుంబమనే వాహనం యొక్క రెండు చక్రాలు..భర్త తన పని ద్వారా డబ్బులు సంపాదిస్తుంటే.. భార్య పిల్లలను సేవించడం, కుటుంబాన్ని చూసుకోవడం వంటివి చూసుకుంటుందని తెలిపారు. ఉమ్మడి కృషి ద్వారా వారు సంపాదించిన వాటికి కూడా అర్హులని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.
