Alimony సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం చూస్తుంటాం. అయితే.. విడాకులు తీసుకున్న భార్య చనిపోతే.. భరణం చెల్లించాల్సి ఉంటుందా..? ఓ వేళ చెల్లించాల్సివస్తే.. ఆ భరణం పొందాడానికి అర్హులేవరు? అనే అంశంపై మద్రాసు హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. ఆ కేసేంటో.. ఆ తీర్పేంటో ఓ సారి చూద్దాం.
Alimony హిందూ వివాహం చట్టం (Hindu Marriage Act)ప్రకారం.. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య లేదా భాగస్వామి తన జీవితాన్ని గడిపేందుకు కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ సొమ్మునే భరణం (Alimony) అంటారు. భాగస్వామి నిత్యవసరాలతో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భరణం అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. అయితే.. విడాకులు తీసుకున్న భార్య చనిపోతే భరణం చెల్లించాలా? ఓ వేళ చెల్లించాల్సి వస్తే.. ఎవరికి చెల్లించాలి? అనే అంశంపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న కుమార్తె ఆస్తులపై తల్లికే హక్కు ఉంటుందని, భరణం చరాస్తే కాబట్టి దాన్ని ఆమెకే(అత్తకు) చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
కేసు వివరాల్లోకెళ్తే.. అన్నాదురై, సరస్వతి 1991లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత మనస్పర్థలతో ఈ జంట విడిపోయారు. 2005లో చెయ్యూర్‌లోని జిల్లా మున్సిఫ్-కమ్-జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత సరస్వతి భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు, తనకు భరణం కింద నెల నెల కొంత మొత్తం చెల్లించాలని సరస్వతి కోర్టును ఆశ్రయించింది. దీంతో 2014 నుంచి నెలకు రూ.7,500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ,అన్నాదొరై మాత్రం కోర్టు ఆదేశాలనే భేఖారత్ చేశాడు. ఆదేశాలకు అనుగుణంగా భరణం చెల్లించకపోవడంతో సరస్వతి 2021లో ఫిర్యాదు చేశారు. తనకు రూ.6.37 లక్షలు బకాయిలు కింద రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయం విచారణలో ఉండగానే సరస్వతి జూన్ 2021లో మరణించింది.
సరస్వతి మరణానంతరం.. అన్నాదురై భరణం బకాయిలు ఇవ్వాలని జయ (సరస్వతి తల్లి) పిటిషన్ దాఖలు చేశారు. చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం కోర్టు ఆమె అభ్యర్థనను అంగీకరించి, జయ భరణం బకాయిలకు అర్హురాలని ప్రకటించింది. కానీ.. ఈ ఉత్తర్వులను అన్నాదురై సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ శివజ్ఞానం బెంచ్.. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం.. భార్య మరణిస్తే ఆమె ఆస్తి పిల్లలకు చెందుతుందని పేర్కొంది. ఒక వేళ పిల్లలు లేనప్పుడు.. ఆ భరణం పొందడానికి తర్వాత అర్హులు అని పేర్కొంది. సరస్వతికి పిల్లలు లేకపోవడం, ఆమె సోదరుడు కూడా మరణించడంతో మనోవర్తి లేదా భరణం బకాయిలు పొందే హక్కు సరస్వతి తల్లి జయకి ఉందని కోర్టు ప్రకటించింది.
కింది కోర్టు ఆదేశాల్లో ఎలాంటి బలహీనత లేదని, అన్నాదురై దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ కేసులో ఎలాంటి మెరిట్ లేదని హైకోర్టు చెప్పిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది . "హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(సి) ప్రకారం.. తల్లి తన కుమార్తె ఆస్తికి అర్హులు. ఈ సందర్భంలో భార్య తల్లి దండ్రులు మరణించే వరకు భరణం అందించాల్సి ఉందని జస్టిస్ శివజ్ఞానం తీర్పు నిచ్చారు.
