Online Marriage: మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ నిర్ణయంతో ఇరు కుటుంబాలు  చాలా సంతోషంగా ఉన్నాయి. పెళ్లి కొడుకు భార‌త్ కు  రాలేక పోవడంతో ఆన్‌లైన్ వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో వివాహాన్ని నిర్వహించాలని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఆదేశించారు.

Online Marriage: మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆన్‌లైన్ వివాహానికి ఆమోదం తెలిపింది. తమిళనాడు చెందిన‌ అమ్మాయికి, భారతీయ సంతతికి చెందిన యుఎస్ అబ్బాయికి వివాహ నిశ్చితార్థమైంది. అయితే.. అనుకొని ప‌రిస్థితుల్లో అబ్బాయి ఇండియాకు రాలేని ప‌రిస్థితి. కానీ, ముందుగా..పెళ్లికి నిర్ణ‌యించుకున్న ముహుర్తంలోనే పెళ్లి చేసుకోవాలని కాబోయే న‌వ‌దంప‌తులు నిర్ణ‌యించుకున్నారు. వారి మాట‌ను ఇరు కుటుంబాలు కాదన‌లేక‌పోయాయి. 

ఈ సందర్భంలో ఇరు కుటుంబాల వారు ఆన్‌లైన్ (డిజిటల్ పద్ధతి) వివాహం చేయ‌డానికి సిద్ధమ‌య్యారు. ఆన్‌లైన్ మ్యారేజ్‌లో పెళ్లికూతురుగా మారనున్న సుదర్శిని భారత్‌లో ఉండగా.. వరుడిగా మారేందుకు సిద్ధమైన రాహుల్ అమెరికాలో ఉంటాడు. అయితే.. హిందూ సంప్రదాయం ప్ర‌కారం.. వివాహమంటే.. క‌న్యాదానం, స‌ప్త‌ప‌ది, మంగ‌ళ‌ధార‌ణ వంటి క్ర‌తువులు చేయాలి. అలా సంప్రదాయ బద్దంగా.. జ‌రిగితేనే వివాహంగా ప‌రిగ‌ణించారు. 

ఈ త‌రుణంలో కాబోయే పెళ్లి కూతురు వాసమి సుదర్శిని ఓ స్పెష‌ల్ రిట్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు లో దాఖలు చేసింది. ఈ పిటిష‌న్ మధురై బెంచ్ అనుమతించింది. ఈ పిటిష‌న్ ను విచారించిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్.. వివాహ హక్కు ప్రాథమిక మానవ హక్కు అని, ప్రత్యేక వివాహ చట్టం 1954లోని సెక్షన్ 12, 13 ఈ హక్కును అమలు చేసే విధంగా రూపొందించాలని గమనించారు. చట్టంలోని సెక్షన్ 12(2) ప్రకారం.. రెండు పార్టీలు ఎంచుకునే ఏ రూపంలోనైనా వివాహం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో.. ఇరు కుటుంబాలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా వివాహం చేయాని నిర్ణ‌యించాయి.

ఆన్‌లైన్ మ్యారేజ్ సందర్భంగా పెళ్లికూతురుగా మారనున్న సుదర్శిని ఇండియాలో ఉండగా, వరుడి రాహుల్ అమెరికాలో ఉంటాడు. చట్టం సాంకేతికతకు అనుగుణంగా ఉండాలి కాబట్టి.. ఇక్కడ వివాహానికి సంబంధించిన పార్టీల ఎంపిక చట్టబద్ధంగా అవసరం. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం వివాహాన్ని నమోదు చేసి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో వివాహాన్ని నిర్వహించాలని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఆదేశించారు.