Asianet News TeluguAsianet News Telugu

అన్ని దేవాలయాల్లో సెల్ ఫోన్లను నిషేధించండి .. మద్రాసు హైకోర్టు ఆదేశాలు

తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్‌లను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆలయాలు పర్యాటక కేంద్రాలు కాదని జస్టిస్ మహదేవన్, జస్టిస్ సత్యనారాయణ ప్రసాద్‌ల ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. అందుకే ఆలయాల్లో మొబైల్‌ తీసుకెళ్లడాన్ని నిషేధించాలి.

Madras HC directs TN govt to prohibit devotees from taking mobile phones inside temples
Author
First Published Dec 2, 2022, 9:50 PM IST

తమిళనాడులోని అన్ని ఆలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడేందుకు  ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ధర్మాసనం వెల్ల‌డించింది. దేశంలోని చాలా పెద్ద దేవాలయాలలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై ఇప్పటికే నిషేధం ఉన్న విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మదురై హైకోర్టు.. రాష్ట్రంలోని దేవాలయాల్లో మొబైల్ ఫోన్‌లను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాల‌యాల ప‌రిశుద్ధ‌త‌, ప‌విత్ర‌త‌ను కాపాడడం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది. వాస్తవానికి గత నెలలో తూత్తుకుడి జిల్లాకు చెందిన అర్చకుడు సీతారామన్ ఈ మేరకు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందు .. తిరుచెందూర్‌లోని శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది.

మొబైల్ ఫోన్ల వల్ల సమస్యలు 

ఆలయాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం వల్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ లోపలి భాగాన్ని ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. భక్తులు ఆలయం లోపల సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభిస్తారు. దీని కారణంగా కొన్నిసార్లు రద్దీని నియంత్రించలేము. దీంతో పాటు మొబైల్ ఫోన్ల వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కావున ఆలయం లోపల సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

 ఏ ఆలయం పర్యాటక కేంద్రం కాదు

ఈ పిటిషన్ ను  జస్టిస్ ఆర్. మహదేవన్,జస్టిస్ జె. సత్యనారాయణ ప్రసాద్ ధర్మాసనం విచారించింది. ఆలయాలు పర్యాటక కేంద్రాలు కాదని తన నిర్ణయంలో పేర్కొంది. అలాగే..  సంప్రదాయ దుస్తుల్లో వచ్చే వారినే దర్శనానికి అనుమతించాలని తెలిపారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని తిరుచెందూర్ ఆల‌యంలోకి ఫోన్ల‌ను అనుమ‌తించ‌డం లేదు. భ‌క్తులతో పాటు ఆల‌యంలో ప‌నిచేసే సిబ్బంది కూడా గుడిలోప‌లికి ఫోన్లు తీసుకురావ‌ద్ద‌ని నోటీసు బోర్డులు పెట్టారు. ఈ నిర్ణ‌యాన్ని న‌వంబ‌ర్ 14 నుంచి ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. 

ఇదిలాఉంటే.. పిల్లలపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలు, విధానాలను పటిష్టంగా అమలు చేయాలని గతంలో మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల కేసులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios