భోపాల్‌: గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర: అంటాం. అంటే మనదేశంలో గురువును దేవుడిగా కొలుస్తాం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండే కొందరు ఉపాధ్యాయులు అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గురువు అనే పదానికి కలంకం తెస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన చిన్నారులపై కామంతో చూస్తూ సభ్య సమాజం తలదించుకునేలా ఘోరాలకు పాల్పడుతున్నారు కొందరు ఉపాధ్యాయులు.  

భోపాల్ లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. స్కూల్ లో పాడు బుద్ధి ప్రదర్శించి కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని పండగోన్‌ గ్రామంలో ఒ ఉపాధ్యాయుడు మైనర్‌ బాలికలకు అశ్లీల వీడియోలు చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అయితే ఈ విషయంపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

బాధిత విద్యార్థినులు  టీచర్‌ ఆశ్లీల చిత్రాలూ చూస్తూ, తమకు చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని విద్యార్థినులు పోలీసుల ఎదుట వాపోయారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.