LPG price hike: ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెరుగుదలతో పాటు దేశంలోని నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ధరల పెరుగుదల, ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో మహిళలు ఎల్‌పీజీ సిలిండర్లతో వినూత్నంగా నిరసనలకు దిగారు.
Madhya Pradesh : దేశంతో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. వీటి ప్రభావం ఇప్పుడు నిత్యావసరాల పై పడింది. దీంతో వంటింటి భారం సామాన్య ప్రజానీకం భరించలేని విధంగా మారింది. ఈ క్రమంలోనే ధరలను పెరుగుదలపై సర్వ్రత్రా ప్రభుత్వాల తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ధరల పెరుగుదలపై మహిళలు ఎల్‌పీజీ సిలిండర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెరుగుదలను ఖండిస్తూ.. మహిళలు ఎల్‌పీజీ సిలిండర్‌తో గర్బా నృత్యాన్ని ప్రదర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినదించారు. ఇప్పుడు ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకెళ్తే.. LPG - లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరలు మరియు కూరగాయలు, పప్పులు, పాల రాకెట్ ధరల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మధ్యప్రదేశ్‌లోని ఒక సమూహం నవరాత్రి సందర్భాన్ని ఎంచుకుంది. ఆ సమూహం మహిళలు తమ తలపై మినీ LPG సిలిండర్‌తో 'గర్బా' నృత్యం చేస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది.
గ్యాస్ సిలిండర్లతో గర్భా నృత్యం చేస్తూ.. నిరసనలకు దిగిన ఈ సమూహంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజలు ఉన్నారు. మహిళలందరూ నవరాత్రి వేడుకల నేపథ్యంలో ఒక ఆలయానికి వచ్చారు. అక్కడ 'కన్యా భోజనం' (Kanya Bhojan) కోసం ఆహారాన్ని వండడానికి LPG సిలిండర్లను తీసుకువెళ్లారు. అక్కడ పెరిగిన సిలిండర్ ధరలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. సిలిండర్లు నెత్తిన పెట్టుకుని నృత్యాలు చేశారు. “మేము 'కన్యా భోజనం' కోసం ఆహారం వండాము. 51 మంది కన్యాలకు (ఆడపిల్లలకు) తినిపించాము. ఈ సమయంలో, మహిళలు పాటలు పాడారు. దుర్గా దేవి కోసం పాటలు పాడుతూ..నృత్యం కూడా చేశారు. తర్వాత, మేము ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతూ.. డ్యాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాము… మేము ఎల్‌పీజీ సిలిండర్‌లతో గర్బా డ్యాన్స్ చేసాము” అని రేవా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ కవితా పాండే అన్నారు.
రోజువారీ వినియోగ వస్తువులు సహా అన్నింటి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ నిరసనలో భాగంగా ఎల్‌పీజీ సిలిండర్‌లతో గార్బా నృత్యం చేశామని పాండే తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, నిత్యావసరాల ధరలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శల పదును పెంచింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న కాంగ్రెస్ మధ్యప్రదేశ్ యూనిట్ రాష్ట్రంలో వారం రోజుల పాటు ద్రవ్యోల్బణ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢోలక్ (డోలు), తాళీలు (ప్లేట్లు) కొడుతూ, 'మజీరా' (తాళం) పాటలు మరియు నృత్యాలతో రాష్ట్రవ్యాప్తంగా ద్రవ్యోల్బణ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాలని కమల్ నాథ్.. కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. \
