Asianet News TeluguAsianet News Telugu

భర్తను వదిలేసి మరో వ్యక్తితో అఫైర్.. మహిళ భుజాలపై యువకుడిని ఎక్కించి...

ఈ క్రమంలో ఆమె భర్తతో విడిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్ లో ఉంటోంది. అయితే.. ఈ విషయాన్ని ఆమె మాజీ భర్త కుటుంబసభ్యులు ఖండించారు.

Madhya Pradesh Woman Shamed, Forced To Walk With In-Laws On Shoulders
Author
Hyderabad, First Published Feb 16, 2021, 9:15 AM IST

కాలం మారుతున్నా.. చాలా ప్రాంతాల్లో మనుషులు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ.. చాలా మంది మహిళలు అత్తింటి వేధింపులు భరిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఓ దళిత మహిళను భర్త కుటుంబసభ్యులు దారుణంగా వేధించారు. బలవంతంగా ఆమె భుజాలపై అత్తింటి కుటుంబ సభ్యుడిని ఒకరిని ఎక్కించుకొని.. మొత్తం నడవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఆమె కూడా అలా చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లా కు చెందిన ఓ దళిత మహిళను అత్తింటి వారు వేధించారు. ఆమెకు వివాహం కాగా.. భర్తతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆమె భర్తతో విడిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్ లో ఉంటోంది. అయితే.. ఈ విషయాన్ని ఆమె మాజీ భర్త కుటుంబసభ్యులు ఖండించారు.

 

వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆమెకు శిక్ష వేశారు. బలవంతంగా ఆమె భుజాలపై ఓ యువకుడిని కూర్చోపెట్టి గ్రామం మొత్తం నడిపించారు. అలా ఆమె నడుస్తుండగా.. కొందరు కర్రలు, బ్యాట్స్ తో కొట్టడం గమనార్హం. ఆమె ఆ బాధలన్నింటినీ భర్తిస్తుంటే.. కొందరు దానిని చూస్తే శునకానందం పొందడం గమనార్హం.

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.. అది కాస్త పోలీసుల కంట పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంబంధీకులను అరెస్టు చేశారు. కాగా.. 2019 జులైలో సైతం ఇద్దరు మహిళలను వారి కుటుంబసభ్యులు ఇదే విధంగా బాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios