భోపాల్: సరదాగా పార్టీ చేసుకొనేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్ బార్యపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ జిల్లాలోని బాధిత మహిళ ఇంటికి సోమవారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే గ్రామానికి చెందిన సునీల్ కుష్వహ, మనోజ్‌ అహిర్వార్‌లు తమ స్నేహితుడి ఇంటికి వెళ్లి ముగ్గురూ కలిసి పీకల్లోతు మద్యం సేవించారు.

మద్యం మత్తులో స్నేహితుడి భార్యపై సునీల్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్త అడ్డగించడంతో మరో వ్యక్తి మనోజ్‌అహిర్వార్‌ స్నేహితుడని కూడా చూడకుండా బాధితుడిని దారుణంగా హత్య చేశాడు. 

మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. కాగా తనపై లైంగిక దాడి అనంతరం నిందితుడు తనను తీవ్రంగా గాయపరిచాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనపై లైంగిక దాడి అనంతరం నిందితుడు తనను తీవ్రంగా గాయపర్చారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

also read భర్త గుడ్డు తేలేదని... ప్రియుడితో లేచిపోయిన భార్య ...