భర్త స్నానం చేయడంలేదని.. తనకు విడాకులు కావాలంటూ ఓ మహిళ కోర్టు ఎక్కింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కి చెందిన మహిళకు గతేడాది అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం గడవలేదు అప్పుడే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు.

అయితే..ర్నేళ్ల పాటు విడిగా ఉండండి..ఆ తర్వాత విడాకులు మంజూరు చేస్తామని భోపాల్‌ ఫ్యామిలీ కోర్టు తెలిపింది. ఇంతకీ విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. తన భర్త గడ్డం తీసేయడం లేదని, రోజుల తరబడి స్నానం చేయడం లేదని.. ఏదైనా అంటే పర్‌ఫ్యూమ్‌ కొట్టుకుంటాడనే కారణాలను చెప్పింది. ఇద్దరు కలిసి కోర్టును ఆశ్రయించగా.. పైవిధంగా తీర్పునిచ్చింది. గతంలో మీరట్‌కు చెందిన ఓ గృహిణి కూడా ఇలాగే.. గడ్డం తీసేస్తావా లేదంటే ఆత్మహత్య చేసుకోవాలా? అని తన భర్తను బెదిరించింది.