Madhya Pradesh: ఫుడ్ డెలివరీ ఏజెంట్ ను చెప్పుతో కొడుతూ.. ఎగిరెగిరి తన్నిన మహిళకు సంబంధించిన ఓ మీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడున్న ప్రజలు కొట్టవద్దని చెప్పిన వినిపించుకోకుండా ఆ మహిళ రెచ్చిపోయింది.. ఆసలు ఏం జరిగింది?
Madhya Pradesh: నడిరోడ్డుపై ఓ మహిళ ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ను చెప్పుతో కొడుతూ.. ఎగిరెగిరి తన్నుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడున్న ప్రజలు కొట్టవద్దని చెప్పిన వినిపించుకోకుండా ఆ మహిళ రెచ్చిపోయింది. ఎవరూ చెప్పిన వినిపించుకోకుండా ఆ ఫుడ్ డెలివరీ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తి బైక్ పై కూర్చొని ఉండి.. తన తప్పులేదని చెబుతున్నప్పటికీ.. ఆమె తన దాడిని కొనసాగించింది. దీంతో ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆలా నడుచుకోవాల్సింది కాదని పేర్కొంటున్నారు.
వివరాల్లోకెళ్తే.. నడిరోడ్డుపై ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను ఓ మహిళ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. డెలివరీ ఏజెంట్ బైక్ తన స్కూటీని ఢీకొనడంతో గాయపడ్డానని మహిళ తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె అతనిపై దాడికి దిగింది. ఆ
వీడియోలో సదరు మహిళ తన షూతో డెలివరీ ఏజెంట్‌ను కొడుతోంది. ఆమె చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆమెను ఆపమని కోరినప్పుడు కూడా ఆమె తన దాడిని అలానే కొనసాగించింది. ఎగిరెగిరి తన్నింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారితో పాటు ఆ ఘటన ముందు.. తర్వాతి పరిస్థితులను గురించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై దాడి చేయడం దారుణమని అన్నారు. కొట్టవదద్దని చెబుతున్న ఆమె పట్టించుకోకుండా అతనిపై దాడి చేసిందన్నారు. మహిళ ద్విచక్ర వాహనం నడుపుతూ స్వయంగా ఫోన్‌లో మాట్లాడుతోందని చెప్పారు. కొందరు బైకర్లు రోడ్డుకు రాంగ్ సైడ్ నడుపుతున్నట్లు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ ఏజెంట్ పొరపాటు వల్ల అతను రాంగ్ లేన్‌లోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. సదరు మహిళ ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానాన్ని నెటిజన్లు ఖండించారు.
"ఇది అతని తప్పు, కానీ అతను అగౌరవపరచబడిన విధానాన్ని సమర్థించలేము" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. మహిళ దారుణంగా ప్రవర్తించిందని, డెలివరీ ఏజెంట్‌కు క్షమాపణ చెప్పాలని మరొకరు రాశారు. "ఆమె ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాలి" అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ఇదిలావుండగా, గతేడాది ఆగస్టులో లక్నోలో రద్దీగా ఉండే కూడలిలో ఓ మహిళ క్యాబ్ డ్రైవర్‌ను ఇలాగే కొట్టింది . క్యాబ్ డ్రైవర్ తనపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ.. ట్రాఫిక్ సిబ్బంది సమక్షంలోనే మహిళ అతడిని పలుమార్లు చెప్పుతో కొట్టింది. తనకు న్యాయం చేయాలని ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
