భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ అధికారి తీరు విమర్శలకు తావిస్తోంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చితకబాదాడు. 

1986 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి పురుషోత్తం శర్మ తన భార్యను కిందపడేసి  కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పురుషోత్తం శర్మ తన భార్యను నేలపై వేసి ఈడ్చుకొంటూ వెళ్లాడు.  తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం విషయాన్ని నిలదీయడంతో ఆయన తన భార్యను కొట్టినట్టుగా సమాచారం. ఈ విషయమై ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ గొడవ జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులున్నారు. అంతేకాదు కుక్క అరుపులు కూడ ఉన్నట్టుగా వీడియోలో కన్పించాయి.

తన ప్రవర్తన దురుసుగా ఉంటే తన భార్య నేరుగా ఫిర్యాదు చేసి ఉండేది. ఇది కుటుంబ తగవని పోలీస్ అధికారి చెప్పారు. తనది హింసాత్మక ప్రవర్తన కాదన్నారు. తనను ఇరికించాలనే ఉద్దేశ్యంతోనే తన భార్య ఇంట్లో కెమెరాలను అమర్చిందని శర్మ చెప్పారు.

పురుషోత్తం శర్మను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. అతడ్ని విధుల నుండి తప్పించినట్టుగా చెప్పారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే ఎంతటివారినైనా వదలబోమన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీఎంకు ట్వీట్ చేశారు.