నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. నిండు నూరేళ్ల పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడలిపైనే మనసు పడ్డ మామ.. కొడుకు చేతిలో అతి కిరాతంగా చంపబడ్డాడు.
నేటి సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. కామంతో కళ్లు ముసుకున్న కొంత మంది పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరిచి.. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. నిండు నూరేళ్ల పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ మామ తన సొంత కోడలిపై మనసు పడ్డాడు. కోడలు సైతం మామపై ఇష్టం పెంచుకుంది. ఇంకేముంది.. కొడుకు లేని సమయంలో.. ఆ మామకోడలి కలిసి ఎంజాయ్ చేశారు. అక్రమ సంబంధం తెలుసుకున్న కొడుకు..తన తండ్రిని అతికిరాతంగా హత్య చేశాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) సియోని పరిధిలోని భూత్ బంధాని గ్రామంలో సంజయ ధుర్వే, తన భార్య, తన తండ్రి దరోగ్ సింగ్ తో కలిసి ఉంటున్నాడు. అయితే సంజయ్‌కు ఇటీవల ఓ యువతితో వివాహం జరిగింది. వారంతా కలిసి ఓకే ఇంట్లో ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. దరోగ్ సింగ్ మాత్రం ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలోనే అందంగా ఉండే కోడలిపై తన కన్నుపడింది. మయ మాటలు చెప్పి తన కోడలును తన వైపుకు తిప్పికున్నాడు. ఇలా క్రమంగా కొడలు కూడా మామపై ఇష్టం పెంచుకుంది. ఇక కొడుకు లేని సమయంలో మామ కోడళ్లు కలిసి ఆనందంగా గడిపేవాడు.
అయితే.. కొన్నాళ్ల తర్వాత తండ్రి, భార్యపై సంజయ్‌కు అనుమానం వచ్చింది. వారి వ్యవహర శైలి చాలా తేడాగా ఉండటం గమనించారు. దీంతో వీరిపై అనుమానంతో కొడుకు తన తండ్రితో గొడవలు పడ్డాడు. అంతే కాకుండా.. భార్యతో కూడా విభేదాలు ఏర్పడ్డాయి. మరీ వీరి వ్యవహారం కంట్రోల్ తప్పడంతో సంజయ్ వారిపై నిఘా పెట్టాడు. తన తండ్రికి తన భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు.
ఇక ఎలా అయినా తండ్రిని చంపాలని ప్లాన్ చేశాడు సంజయ్. తన తండ్రి దరోగ్ సింగ్ కి పని ఉందని చెప్పి.. ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. వారి అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో క్షణికావేశానికి లోనైనా కొడుకు తన తండ్రిని అతికిరాతంగా హత్య చేశాడు. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న భార్య భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు సంజయ్‌ని అరెస్ట్ చేశారు.