Asianet News TeluguAsianet News Telugu

కమల్‌నాథ్‌కు షాక్, రేపే బలపరీక్ష: మధ్యప్రదేశ్ స్పీకర్‌కు సుప్రీం ఆదేశాలు

మధ్యప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ డ్రామాకు సుప్రీంకోర్టు తెర దించింది. కమల్‌నాథ్ సర్కార్‌కు శుక్రవారం బలపరీక్ష నిర్వహించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది

Madhya Pradesh political crisis: Supreme Court order floor test on tomorrow
Author
Bhopal, First Published Mar 19, 2020, 6:23 PM IST

మధ్యప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ డ్రామాకు సుప్రీంకోర్టు తెర దించింది. కమల్‌నాథ్ సర్కార్‌కు శుక్రవారం బలపరీక్ష నిర్వహించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సభ్యులకు చేతులేత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. బలపరీక్ష మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని తెలిపింది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అందే ధీటుగా స్పందించింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ బెంగళూరులో బంధించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మరోవైపు రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురికి స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

Also Read:

కమల్ నాథ్ సర్కారుకు 24 గంటల డెడ్ లైన్ విధించిన సుప్రీం

ఇష్టపూర్వకంగానే...: కమల్ నాథ్ పై రెబెల్ ఎమ్మెల్యే ఎదురుదాడి

మధ్యప్రదేశ్ హై డ్రామా: కమల్ నాథ్ కు ఊరట, అసెంబ్లీ 26 వరకు వాయిదా!
 

Follow Us:
Download App:
  • android
  • ios