మధ్యప్రదేశ్ లో ఓ మహిళ పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరు మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వీడియోలో ఓ మహిళ నిరసన వ్యక్తం చేస్తూ.. మహిళా పోలీసుల బృందాన్ని ఆమెను పట్టుకుని పక్కకు లాగారు. ఆమె పట్ల చాలా అమానుష్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. అయితే,వారి సమాధానం మరింత విమర్శలకు దారితీసింది. ఆ వైరలవుతున్న వీడియోపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే.. పోలీసులు స్పందించిన తీరు మరింత విచిత్రంగా ఉండడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా కౌరియా గ్రామంలో చోటుచేసుకుంది.
ఓ మహిళ తన పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకుంది. తన భూమిలో విద్యుత్ స్తంభం వేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని ఆమె వాపోయింది. ఈ క్రమంలో ఆమె ఇక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఆ కరెంట్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికారులు అక్కడికి పోలీసులను తీసుకొచ్చారు. నిరసన తెలుపుతున్న మహిళను మహిళా పోలీసులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ తరుణంలో ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మహిళను జుట్టు పట్టుకుని లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళ జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన వీడియో వైరల్‌గా మారగా.. పోలీసుల శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి మనోజ్ కేడియా మాట్లాడుతూ..కరెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్న అధికారులకు సదరు మహిళ అడ్డంకులు సృష్టించారని, ఈ క్రమంలో ఆమెను అడ్డుకునేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. తాము మహిళను కొట్టలేదని.. నిబంధనల ప్రకారమే తమ పనిని తాము చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు పోలీసు సిబ్బంది. ఈ క్రమంలో ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఈ ఘటనపై బాధిత మహిళ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీంతో ఆమె తన లాయర్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టర్, విద్యుత్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కుమ్మక్కై తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు నష్టపరిహారం ఇవ్వకుండా అక్రమంగా తన పొలంలో కరెంటు స్థంభాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని వాపోయింది.ఈ క్రమంలో తనపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
