Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జ‌రిగిన  మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల్లో ఓ వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో  అలీరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ ఇద్దరు భార్యలు బంప‌ర్ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు.  అయినప్పటికీ.. తన మూడవ భార్య ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు.

Madhya Pradesh: ఇటీవ‌ల జరిగిన మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఓ విచిత్ర ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అలీరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ సమర్థ్ మోర్యా వార్త‌ల్లో నిలిచారు. ఎన్నికలు అన్నాక‌..గెలుపు ఓట‌ములు స‌హ‌జమే క‌దా..! అందులో ప్ర‌త్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మేముంది. అనుకుంటున్నారా?.. వాస్త‌వానికి ఎన్నిక‌లు అన్నాక‌ గెలుపు ఓట‌ములు సహ‌జ‌మే.. కానీ, ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌రుఫు వాళ్లకు భారీ విజ‌యమే ద‌క్కింది. అయినా.. బాధ ప‌డుతున్నారంట‌. విచారం వ్య‌క్తం చేస్తున్నారంట‌.. ఈ ఎన్నిక‌ల్లో త‌న ఇద్దరు భార్యలు ఘ‌న విజ‌యం సాధించారు. అయినప్ప‌టికీ త‌న మూడో భార్యను ఎన్నికల్లో పోటీ చేయించ‌నందుకు సమర్థ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారంట‌.

వాస్త‌వానికి పంచాయతీ ఎన్నికలకు ముందు అలీరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ సమర్థ్ మోర్యా మూడు పెళ్లిళ్లు చేసుకుని , చాలా రోజులు చర్చల్లో నిలిచారు. తాజాగా..త‌న ఇద్దరు భార్యలు ఎన్నికల్లో గెల‌వ‌డంతో వార్త‌ల్లో నిలిచారు. అంత సంతోషంతో సంబురాలు చేసుకుంటే.. అతడు మాత్రం పశ్చాత్తాపపడుతున్నాడు. ఎన్నిక‌ల్లో మూడో భార్యను ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు వారి భార్యల విజయం తర్వాత, సమర్త్ గ్రామం మొత్తం తిరుగుతూ ప్రజలకు మిఠాయిలు పంచుతూ.. విజ‌యోత్సవ ర్యాలీలు తీస్తున్నారు.

సమాచారం ప్రకారం.. అలీరాజ్‌పూర్‌లోని నాన్‌పూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సమర్థ్ మోరియా వివాహం చేసుకున్నప్పుడే వెలుగులోకి వచ్చాడు. 300 మందికి పైగా సమక్షంలో.. సమర్థ్ మోరియా ముగ్గురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. అతని భార్యల పేర్లు సక్రి, మేళా, నాని బాయి. ఈ పెళ్లిపై ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ప్ర‌స్తుతం ..సమర్థ్ మోర్యా తన ముగ్గురు భార్యలతో ఒకే ఇంటిలో నివసిస్తున్నాడు. అందరూ కలిసి వేడుకకు హాజరవుతారని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. 2003లో నానిని, 2008లో మేళాను, 2017లో సక్రిని పెళ్లాడాడు. ఆ తర్వాత అందరూ కలిసి లాంఛనంగా పెళ్లి చేసుకున్నారు.

గ‌తంలో సమర్థ్ మోర్యా .. అలీరాజ్‌పూర్ సర్పంచ్‌గా కూడా పనిచేశారు. తాజాగా ఆయన త‌న‌ భార్యలిద్దరిని పంచాయతీ ఎన్నికల్లో బ‌రిలో దించారు. వారు ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించారు. స‌మ‌ర్త్ త‌న భార్య ల విజ‌యం త‌ర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన త‌న గ్రామంలోని ప్ర‌తి ఇంటికి తిరుగుతూ.. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ఇదిలా ఉంటే.. పంచాయ‌తి ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు భార్య‌లు గెలిచిన త‌ర్వాత కూడా ఓ విష‌యంలో స‌మ‌ర్ ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నాడ‌ని చెబుతున్నారు. నిజానికి ఆయన మూడో భార్య ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. సమర్థ్ మూడో భార్య విద్యాశాఖలో ఉద్యోగి. భార్య పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేదని సమర్థ్ అంటున్నారు. ఆమె విద్యాశాఖలో ప్యూన్‌గా పనిచేస్తున్నారు. సమర్థ్ మోర్యా భిలాలా వంటి తెగకు చెందిన వాడు. ఈ తెగ‌వారు ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో వారు వివాహం హిందూ వివాహ చట్టం కిందకు రాదు.