Asianet News TeluguAsianet News Telugu

అత్తారింటికి వెళుతూ... చెరువులో దూకిన నవ వధువు

ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు.

Madhya Pradesh: Nearly 30-minutes after 'bidai', bride jumps into river, remains missing
Author
Hyderabad, First Published Jun 15, 2020, 10:54 AM IST

ఆమె మెడలో తాళి పడి కొద్ది గంటలు కూడా కావడం లేదు. బంధువుల ఆనందోత్సాహల మధ్య పెళ్లి జరిగిన కాసేపటికే వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అత్తారింటికి వెళుతుండగా.. చెరువులో దూకేసింది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్తాన్‌ అలపుర్‌కు చెందిన ఓ యువతికి శనివారం రాత్రి పెళ్లైంది. ఆ తర్వాత రోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపే వేడుక జరిగింది. అనంతరం భర్త, అత్తామామలతో కలిసి ఆమె మధ్యప్రదేశ్‌ షియోపూర్‌లోని అత్తారింటికి కారులో బయలు దేరింది.

 ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు.

దీంతో ఆమె స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్‌ బ్రేకులు వేశాడు. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే.. వధువు కారు నుంచి బయటకు దిగి నదిలో దూకేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వధువు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఇప్పటివరకూ గల్లంతు అయిన వధువు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ సంఘటనపై వధువు తండ్రి మాట్లాడుతూ.. ‘‘ శనివారం రాత్రి పెళ్లి జరిగినప్పుడు కూడా తను బాగానే ఉంది. ఇంతలో ఏమైందో అర్థం కావటం లేదు’’ అంటూ వాపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios