ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, మిజోరంలో ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్ జిల్లాలోని లంజీ, పరస్వాద, బైహర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.

మిగిలిన స్థానాలకు యధావిథిగా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5, 04, 95,251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక 40 స్థానాలున్న మిజోరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 209 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. 7.7 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.