మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఒక వ్యక్తి తన రెండో భార్యతో గొడవల పడి తన 7 ఏళ్ల కొడుకును నిర్దాక్షణ్యంగా గొంతుకోసి హత్య చేశారు.  జిల్లాలోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింబోడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రి కొడుకు పాలిట కాలయముడయ్యాడు. తన ఏడేళ్ల కుమారుడిని నిర్ధాక్ష్యంగా గొంతు నులిమి చంపాడు. చిన్నారి అమ్మమ్మ మనవడి గదికి చేరుకోగా.. అక్కడ శవమై కనిపించారు. వృద్ధురాలి అరుపులు విని కుటుంబ సభ్యులంతా గుమిగూడారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళ్తే.. ఇండోర్‌లోని తేజాజీ నగర్ ప్రాంతంలోని లింబోడి గ్రామంలో ఒక తండ్రి తన 7 ఏళ్ల అమాయక కుమారుడిని చంపాడు. నిందితుడు శశికాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో కారు డ్రైవర్. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి మొదటి భార్య కుమారుడు ప్రతీక్ (7). తన మొదటి భార్య చనిపోవడంతో మరోపెళ్లి చేసుకున్నాడు.

అయితే.. రెండో భార్యకు మొదటి భార్య కొడుకు(ప్రతీక్) నచ్చలేదు. ఈ విషయంలో వారిద్దరూ తరుచు గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి మూడో భార్య పాయల్ నుంచి శశికాంత్ కి ఫోన్ చేసింది. ప్రతీక్ విషయంలో పాయల్ అతనితో వాగ్వాదానికి దిగింది. బిడ్డను వదిలేయాలని, లేదంటే చంపేయాలని పాయల్ పట్టుబట్టింది. చిన్నారిని విడదీయాలని పాయల్ శశికాంత్‌పై ఒత్తిడి తెచ్చింది. పాయల్ కూడా రెండు నెలల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, అందుకే ఆమె తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. 

తండ్రితో కలిసి పడుకున్న కొడుకు ఉదయం శవమై..

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల గురించి కొడుకు(ప్రతీక్) తన పెద్ద తండ్రి(రాజేష్ ముండే)కి చెప్పి తిరిగి వచ్చి గదిలో తండ్రితో కలిసి పడుకున్నాడు. ఈ క్రమంలో శశికాంత్ ఉదయం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. చాలా సేపటికి ప్రతీక్‌లో చలనం లేకపోవడంతో అమ్మమ్మ గదికి చేరుకుంది. ప్రతీక్ మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు 

పోలీసు అడిషనల్ డీసీపీ జైవీర్ సింగ్ భడోరియా తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో తండ్రి తన 7 ఏళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. అతడు పారిపోయిన విషయాన్ని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతమంతా బారికేడ్లు వేసి అలర్ట్ ప్రకటించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ వ్యవహారంలో రెండో భార్య పాత్రపై దర్యాప్తు చేయనున్నారు. నేరం రుజువైతే.. ఆమెను కూడా అరెస్టు చేస్తామన్నారు.