Asianet News TeluguAsianet News Telugu

తండ్రి చనిపోలేదని, మృతదేహానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్న ఐపీఎస్

నిరాక్ష్యరాస్యులే కాకుండా కొన్ని కొన్ని సార్లు బాగా చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలను విశ్వసించిన ఘటనలు కోకొల్లలు. ఏకంగా ఐపీఎస్ లాంటి అత్యున్నత అధికారి చేస్తే అది ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది.

madhya pradesh ips keeping dead body of father at home, treated from one mo
Author
Bhopal, First Published Feb 14, 2019, 3:33 PM IST

నిరాక్ష్యరాస్యులే కాకుండా కొన్ని కొన్ని సార్లు బాగా చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలను విశ్వసించిన ఘటనలు కోకొల్లలు. ఏకంగా ఐపీఎస్ లాంటి అత్యున్నత అధికారి చేస్తే అది ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ‌‌క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేంద్ర కుమార్ మిశ్రా తండ్రి కేఎం మిశ్రా గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

జనవరి 13న ఆయన్ను భోపాల్ లోని బన్సాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కేఎం మిశ్రా జనవరరి 14 సాయంత్రం మరణించారు. దీంతో తండ్రి మృతదేహాన్ని రాజేంద్ర కుమార్ తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. అక్కడే తన తండ్రి భౌతిక కాయానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నారు.  

ఆ ప్రాంతంలో రాష్ట్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారిక నివాసాలు ఉన్నాయి. నెల రోజులుగా ఆయన ఇలాగే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజేంద్రకుమార్ నివాసం వద్ద ప్రత్యేక ఆర్మీ బలగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహించడానికి వచ్చారు.

మృతదేహానికి ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకోవడంతో అది మీడియాకు చేరింది. దీనిపై మీడియా ప్రతినిధులు రాజేంద్రకుమార్‌ను ప్రశ్నించగా... తన తండ్రి చనిపోలేదని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.

తన తండ్రి పరిస్థితిపై ఆస్పత్రి ఇచ్చిన నివేదికపై తాను స్పందించనన్నారు. దీంతో ఆయన తండ్రిని చూపించాల్సిందిగా మీడియా కోరింది. అయితే అందుకు రాజేంద్ర కుమార్ అంగీకరించలేదు. అయితే దీనిపై కేఎం మిశ్రాకు చికిత్స అందించిన బన్సాల్ ఆసుపత్రిని వివరణ  కోరింది..

మిశ్రాను రాజేంద్రకుమార్ జనవరి 13న ఆసుపత్రిలో చేర్పించారని, ఆయనకు అశ్విని మల్హోత్రా అనే వైద్యుడు చికిత్స అందించారని వైద్యులు తెలిపారు. జవనరి 14న కేఎం మిశ్రా మరణించారని, ఈ మృతికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios