Madhya Pradesh: మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లో మేనేజర్​గా పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళా.. తన నివాస భవనంలోని ఐదో అంతస్తు నుంచి దూకి  ఆత్మ‌హ‌త్య చేసుకుంది. 

Madhya Pradesh: మధ్యప్రదేశ్​ లోని భోపాల్​లో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంపిఐడిసి)లో మేనేజర్​గా ప‌ని చేస్తున్న‌ 27 ఏళ్ల మహిళా అధికారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. భోపాల్‌లోని త‌న‌ నివాస భవనంలోని ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు. 

సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎంపీఐడీసీ మేనేజర్ రాణి శర్మ తన ఐదో అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకినట్లు షాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మహేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. ఆ తర్వాత శర్మను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్వాలియర్‌కు తీసుకెళ్లారు.

శర్మ ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిందో ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మహిళ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై షాపురా స్టేషన్ హౌస్ ఇన్‌ఛార్జ్ మహేంద్ర కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌పై బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నామ‌ని తెలిపారు. బాధిత మహిళ.. ఫ్లాట్‌లో త‌న‌ రూమ్‌మేట్‌తో నివసిస్తుందనీ, బాధితురాలు గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉందని ఆమె వెల్లడించింది. గ‌త పది రోజుల క్రితం.. రాణి శర్మ తల్లి భోపాల్‌కు వచ్చింది. ఆమెతో ఫ్లాట్‌లో ఉంటుంద‌ని తెలిపారు. అవసరమైతే ఆమె కార్యాలయ సహోద్యోగుల స్టేట్‌మెంట్‌లను కూడా రికార్డ్ చేస్తామని తెలిపారు.