మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య తరచూ జరిగే చిన్న చిన్న గొడవలు హత్యకు దారి తీశాయి. గొడ్డలి, కొడవలి, బ్లేడ్‌లతో భార్య ప్రైవేట్ పార్టులపై దాడి చేశాడు. గొంతు కోశాడు. చెవులను తెగ్గోశాడు. 

రత్లాం: ఓ కుటుంబ కలహం దారుణ హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా నరికి చంపేశాడు. గొడ్డలి, కొడవలితో ఆమె ప్రైవేట్ పార్టులపై వేటు వేశాడు. ఆ తర్వాత బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఆమె రెండు చెవులనూ తెగ్గోశాడు. ఆ తర్వాత ఆ భర్త కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

మరణించిన వ్యక్తిని 35 ఏళ్ల బాలు సింగ్‌గా గుర్తించారు. తలోడ్ గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ కొడుకు. బాలు సింగ్ భార్య తేజ్ కున్వార్ (32). ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు అలోట్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నారాయణ్ గిరి తెలిపారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ లభించలేదని వివరించారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం. 13 ఏళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు. ఈ ఘటనకు ముందే పిల్లలను తేజ్ కున్వార్ తల్లి ఇంటికి పంపించారు.

ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం, ఆ దంపతులు చిన్న చిన్న విషయాలకే తరుచూ గొడవ పడేవారు. గతంలో అలోట్ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. అలా జరిగిన ఓ గొడవలో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలు సింగ్ భార్యపై దాడికి దిగాడ. గొడ్డలి, కొడవలి, బ్లేడ్‌తో ఆమె ప్రైవేట్ పార్టులపై దాడి చేశాడు. అదే కోపంలో ఆమె గొంతును కోశాడు. దవడ పగులకొట్టాడు. చెంపలనూ కోసేశాడు. ఆమె రెండు చెవులను కోశాడు.

Also Read: రేపటికల్లా కర్ణాటక సీఎంపై నిర్ణయం.. అప్పటి వరకు ఫేక్ న్యూస్ నమ్మొద్దు: కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా

మంగళవారం గ్రామ సర్పంచ్ సురేశ్ పొర్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ ఇంటి తలుపు లోపలి వైపు నుంచి తాళం వేసి ఉన్నది. దీంతో పోలీసులు ఆ తలుపు బద్దలు కొట్టారు. డోర్ ఓపెన్ కాగానే భర్త ఉరి తాడుకు వేలాడుతూ.. ఆమె రక్తపు మడుగులో కనిపించారు.

పోలీసులు రత్లాం నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్‌ను రప్పించింది. ఆ తర్వాత డెడ్ బాడీలను అలోట్ సివిల్ హాస్పిటల్‌కు పంపించారు. పోస్టుమార్టం నిర్వహించారు.