Asianet News TeluguAsianet News Telugu

కాలుతున్న శవాలకు, అధికారిక లెక్కలకు కుదరని పొంతన: మధ్యప్రదేశ్ సర్కార్‌పై ఆరోపణలు

దేశంలో సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. వైరస్ బారినపడి జనాలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. మరోవైపు అదే స్థాయిలో మరణాలు. ఏ మూల చూసినా కుప్పలుగా కాలుతున్న కరోనా రోగుల మృతదేహాలు.. అవి అయిపోగానే అంత్యక్రియల కోసం కరోనా రోగుల మృతదేహాలతో వచ్చి క్యూ కట్టిన అంబులెన్సులు ఇదీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి. 

madhya pradesh govt hiding covid deaths cremations challenge official data ksp
Author
bhopal, First Published Apr 14, 2021, 3:15 PM IST

దేశంలో సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. వైరస్ బారినపడి జనాలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. మరోవైపు అదే స్థాయిలో మరణాలు. ఏ మూల చూసినా కుప్పలుగా కాలుతున్న కరోనా రోగుల మృతదేహాలు.. అవి అయిపోగానే అంత్యక్రియల కోసం కరోనా రోగుల మృతదేహాలతో వచ్చి క్యూ కట్టిన అంబులెన్సులు ఇదీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి. రోజూ పదుల సంఖ్యలో కరోనా రోగుల మృతదేహాలకు అక్కడ అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.

అయితే, రోజూ ఈ స్థాయిలో మృతదేహాలకు అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.

స్థానికులైతే 1984 భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 40 నుంచి 50 వరకు మృతదేహాలకు అధికారులు అంతిమ సంస్కారాలను చేస్తున్నారని అంటున్నారు.

కరోనా రోగుల మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయాలంటే కనీసం మూడు గంటలైనా వేచి చూడాల్సి వస్తోందని, వారి తరఫున వచ్చిన బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

అయితే, గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, శ్మశానాల్లో కాలుతున్న మృతదేహాల లెక్కలకు పొంతన ఉండడం లేదని  ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలు, కేసులను దాస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏప్రిల్ 8న 41 మృతదేహాలకు శ్మశానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే.. బులెటిన్ లో మాత్రం కేవలం 27 మరణాలనే చూపించారు. ఏప్రిల్ 9న 35 శవాలను కాలిస్తే.. 23 మందే చనిపోయారని వెల్లడించారు.

ఏప్రిల్ 10న 56 మంది చనిపోతే.. 24, ఏప్రిల్ 11న 68 మందికి.. 24, ఏప్రిల్ 12న 59 మరణాలకు 37 మరణాలనే చూపించారు. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. తాము లెక్కలను దాయడం లేదని... ఒకవేళ దాచినంత మాత్రాన తమకేమీ అవార్డులు రావంటూ  వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios