Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు ఐదేళ్లపాటు సెలవులు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, కారణమిదే

మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, విద్య, వైద్యం, రెవెన్యూ విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సెలవు సమయంలో వారికి సగం జీతం మాత్రమే ఇస్తారు. 

madhya pradesh govt decides to give paid leaves for 5 years for govt employees ksp
Author
Bhopal, First Published Jul 23, 2021, 2:47 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీని బారినపడని దేశమంటూ లేదు. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. తొలి దశ నుంచి కోలుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రభుత్వాలు ఆర్ధిక కష్టాలతో అల్లాడుతున్నాయి. దీంతో, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మనదేశంలోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, విద్య, వైద్యం, రెవెన్యూ విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సెలవు సమయంలో వారికి సగం జీతం మాత్రమే ఇస్తారు. ఖర్చును తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం ముద్ర వేశారు.

మధ్యప్రదేశ్‌కు ఇప్పటికే 2.53 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిరర్థక ఆస్తులను అమ్మి రూ. 500 కోట్ల వరకు సమీకరించారు. ఇప్పుడు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతంలో సగం ఆదా అవుతుంది. తద్వారా ఏటా రూ. 6 వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే అవకాశం కల్పించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios