తోడబుట్టిన  చెల్లిపై సొంత అన్నలు ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి మధ్యప్రదేశ్ లోని సాగర్ కి చెందిన 12ఏళ్ల బాలిక స్కూల్ కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. బాలిక శవమై.. వారి గ్రామ చివర కనపడింది.

పోలీసులు మొదట అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వారి కుటుంబానికి సన్నిహితుడు, బాలికకు అంకుల్ వరస అయ్యే చోటా పటేల్ అనే వ్యక్తి పై మొదట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా.. ఆమె అన్నయ్య.. ఆమెను అంకుల్ పటేల్ వద్దకు తీసుకువచ్చాడు.

బాలికను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి.. చోటా పటేల్... బాలిక ఇద్దరు అన్నలు.. అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా హత్య  చేశారు. ఆమె మృతదేహాన్ని గ్రామానికి చివరన చెత్తలో పడేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కన్నకూతురు కానరాని లోకాలకు వెళ్లడంతో.. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.