మధ్యప్రదేశ్‌లో ఓ యువతి, ఆమె తండ్రిని కానిస్టేబుల్ తుపాకీతో కాల్చేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తున్నది. వారిద్దరిని కాల్చిన తర్వాత ఆ కానిస్టేబుల్ ఓ ట్రైన్ ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం కారణంగా ఇద్దరు ప్రాణాలు పోయాయి. ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్వయంగా ఓ మధ్యప్రదేశ్ కానిస్టేబుల్.. యువతిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత ఓ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బెర్చా పోలీసు స్టేషన్ పరిధిలోని మాలిఖేడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి యువతిని, ఆమె తండ్రిని ఇద్దరిని ఓ ప్రేమ వ్యవహారంలో తుపాకీతో కాల్చేశాడని పోలీసులకు ఆ రోజు రాత్రి సమాచారం వచ్చింది. ఆ సమాచారం తెలియగానే పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. స్పాట్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఆమె తండ్రి మాత్రం ఘటనలో మరణించినట్టు సబ్ డివిజనల్ ఆఫ్ పోలీసు భవిష్య భాస్కర్ ఏఎన్ఐకి వివరించారు.
Also Read: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం లేదు: కేంద్రంపై ఖర్గే విమర్శలు
అదే కేసులో ఉదయం అదే ఏరియాలో రైల్వే ట్రాక్ సమీపంలో ఓ డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేశారు.
వారిద్దరిని తుపాకీతో కాల్చిన తర్వాత కానిస్టేబుల్ ట్రైన్ ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ కానిస్టేబుల్‌ను సుభాష్ ఖరాడిగా గుర్తించారు. దేవాస్ పోలీసు లైన్స్‌లో ఆయన విధుల్లో ఉండేవారు.
