మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జిల్లా కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించడం దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జోబత్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కళావతి భురియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ప్రజా ప్రయోజనాలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారని.. విధులు సరిగా నిర్వర్తించడం లేదంటూ ఘాటుగా విమర్శించారు. అంతే కాదు ‘‘నువ్వు మరో నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటావు.. చివరిసారి ఇక్కడి ఆహారం తినాలని సూచించారు.

నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశావని వ్యాఖ్యానించారు. ఆమె అలా వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే కలెక్టర్ గణేశ్ శంకర్ మిశ్రా వేరే ప్రాంతానికి బదిలీ కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బదిలీ చేసిన 48 మంది ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది.