ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరువునష్టం దావా వేశారు. తనకు అసలు సంబంధమే లేని వ్యవహరంలో ప్రమేయం ఉందంటూ రాహుల్ తన పరువు తీశాడంటూ కార్తికేయ కోర్టును ఆశ్రయించాడు. తనకు పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన రాహుల్ పై చర్యలు తీసుకోవాలని అతడు కోర్టును కోరారు. 

సోమవారం మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై విమర్శల వర్షం కురింపించారు. ఈ క్రమంలోనే పనామా పత్రాల్లో చౌహన్‌ కొడుకు పేరు ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫనామా పత్రాల్లో అసలు కార్తికేయ పేరు  లేకపోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది.

ఇలాంటి ఆరోపణలు పూర్తి సమాచారం తెలిసినపుడే చేయాలని బిజెపి నాయకులు రాహుల్ పై మండిపడుతున్నారు. అయితే దీనిపై స్పందిస్తూ రాహుల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీలో అవినీతి ఎక్కువ కాబట్టే తాను పొరపడినట్లున్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 

రాహుల్ పై కార్తికేయ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ నవంబరు 3న విచారణకు రానుంది. ఆలోపు ఒకవేళ  రాహుల్‌ క్షమాపణలు చెప్పాలనుకున్నా అది కోర్టు ఎదుటే చెప్పాలని కార్తికేయ కోరుకుంటున్నట్లు అతడి తరపు న్యాయవాది తెలిపారు.