Asianet News TeluguAsianet News Telugu

శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా: ఆ బారిన పడిన తొలి సీఎం ఈయనే

ట్విట్టర్ వేదికగా తాను కరోనా వైరస్ బారినపడ్డట్టుగా మధ్యప్రదేశ్ ముఖాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan tests positive for coronavirus
Author
Bhopal, First Published Jul 25, 2020, 12:41 PM IST

సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరూ ఈ కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కరోనా బారిన పడగా.... తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రే ఈ కరోనా బారిన పడ్డారు. 

శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా తాను కరోనా వైరస్ బారినపడ్డట్టుగా మధ్యప్రదేశ్ ముఖాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. తనను కలిసినవారంతా టెస్టులు చేపించుకొని క్వారంటైన్ లోకి వెళ్లాలని కోరారు శివరాజ్ సింగ్. కరోనా వైరస్ బారినపడ్డ తొలి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ నిలిచారు. 

ఇకపోతే... భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రదశకు చేరుకుంది. గత 24 గంట‌ల్లో 48,916 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి, ఒక్కరోజే 757 మంది మృతి చెందారు. కాగా.. నిన్నటి కేసులతో భారత్ లో మొత్తం  13,36,861కి క‌రోనా పాజిటివ్ కేసులు చేరాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు 30,645 మంది మృతిచెందారు. అన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్నమొన్నటివరకూ ఒక మోస్తరుగా వున్న కరోనా కేసులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి, రెండు రాష్ట్రాల్లోనూ కేసులు లక్షా 20వేలు దాటిపోయాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉండగా.. నిన్న ఒక్కరోజే 34,602 మందికి కరోనా మహమ్మారిని జయించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు ప్రస్తుతం అది 2.38శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ కొనసాగుతున్నాయి.మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 30వేలు దాటింది. దీంతో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. 

ఇక శుక్రవారం ఉదయం నాటికి కేసుల్లో మరో రికార్డు నమోదయ్యింది. వారం రోజుల కిందట 25వేలుగా ఉన్న కరోనా మరణాలు.. మరో ఏడు రోజుల్లో 30వేలు దాటాయి. అంతకు ముందు 20 వేల నుంచి 25 రోజులకు చేరడానికి 10 రోజులు సమయం పట్టింది. కానీ 15 వేల నుంచి 20వేలకు చేరడానికి 11 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం కరోనా మరణాల్లో ఫ్రాన్స్‌ దేశాన్ని భారత్ అధిగమించింది. 

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో కరోనా మృతుల రేటు 3.6 శాతం ఉండగా... మొత్తం కరోనా మరణాలు 40 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ముంబయి నగరంలో ఇప్పటి వరకూ 5,930 మంది కరోనాతో చనిపోయారు.దేశంలోనే మహారాష్ట్ర తరువాత ఏపీలోనే ఒక్కరోజులో 8 వేల కేసులు దాటాయి. దీంతో ఆందోళన మరింతగా పెరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios