ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మిజోరం, మధ్యప్రదేశ్‌లలో ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని ఆయన కొనియాడారు. అంతకు ముందు ఆయన నర్మదా నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.