Asianet News TeluguAsianet News Telugu

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు, 30 మంది దుర్మరణం: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు బస్సు ప్రమాదం చోటు చేసుకొంది. పాట్నా గ్రామానికి సమీపంలో బ్రిడ్జిపై నుండి కాలువలోకి బస్సు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిధి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. సిధి నుండి సాత్నాకు బస్సు వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 

Madhya Pradesh: Bus carrying 54 passengers slides into canal in Sidhi district; rescue operation on lns
Author
Madhya Pradesh, First Published Feb 16, 2021, 12:00 PM IST

భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు బస్సు ప్రమాదం చోటు చేసుకొంది. పాట్నా గ్రామానికి సమీపంలో బ్రిడ్జిపై నుండి కాలువలోకి బస్సు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. సిధి నుండి సాత్నాకు బస్సు వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణీకులున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు ప్రమాదం జరిగిన చోట గాలింపు చర్యలు చేపట్టారు. 

బస్సులో ఉన్న ప్రయాణీకులను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఏడు మృతదేహాలను బయటకు తీశారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే ఏడుగురు ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొన్నారు.

ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.. గజ ఈతగాళ్లు కూడ బస్సులోని ప్రయాణీకుల కోసం గాలిస్తున్నారు. రేవా-సిధు సరిహద్దుల్లో ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు తెలిపారు.

బ్రిడ్జిపై నుండి ప్రయాణీస్తున్న బస్సు కంట్రోల్ తప్పి కాలువలోకి దూసుకుపోయింది. కాలువలో పూర్తి స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఈ నీటిలోనే బస్సు మునిగి కొట్టుకుపోయిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు.

బస్సులోని ప్రయాణీకులంతా గల్లంతైనట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదం గురించి తెలుసుకొన్నారని సీఎం కార్యాలయ అధికారి సత్యేంద్ర ఖరే తెలిపారు.సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిధి కలెక్టర్ ను ఆదేశించారు.

కాలువలో నీరు ఎక్కువగా ఉన్నందున రెస్క్యూ ఆపరేషన్స్ కు విఘాతం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. షాహోల్ జిల్లాలోని సోన్ నదిపై నిర్మించిన బన్సాగర్ ఆనకట్ట నుండి నీటిని విడుదల చేయడం నిలిపివేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios