Madhubala Sister Kaneez: భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్రవేసిన స్టార్ నటి మధుబాల. ఆమె సోదరి కనీజ్ బల్సారానిని ఆమె కోడలు ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. అక్లాండ్ మరియు అక్కడి నుంచి ముంబయికి వస్తున్న క్రమంలో తన తల్లికి జరిగిన దారుణ విషయాలను ప్రస్తావిస్తూ.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కు పేర్విజ్ లేఖ రాసింది.
Madhubala Sister Kaneez: ప్రతి ఇంట్లోను అత్త కోడళ్ళ మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం అయింది. ఈ మధ్య కాలంలో అయితే, మరింతగా పెరిగింది. పాతకాలంలో లాగా కలిసుంటున్న కుటుంబాలు చాలా తక్కువ. రెక్కలొచ్చాక కన్నపేగును దూరం పెడుతూ బతికుండగానే నరకం చూపిస్తున్నవాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు కొడుకులు చూసుకున్నా కోడళ్లు మాత్రం రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. సాధారణ కుటుంబాల నుంచి ధనిక కుటుంబాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ.. నిత్యం వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఇండియన్ స్టార్ హీరోయిన్ సోదరికి సైతం ఇదే తరహా అనుభవం ఎదురైంది. 90 సంవత్సరాల వయస్సు పైబడిన ఆమెను తన కోడలు ఇంటి నుంచి గెంటి వేసింది. దేశం కానీ దేశంలో ఒంటరిగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసి.. విమానం ఎక్కించి స్వదేశానికి తరిమేసింది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాకింగ్ కు గురిచేస్తున్నది.
వివరాల్లోకెళ్తే.. దేశ సినీ చరిత్రలో చెరగని ముద్రవేసిన స్టార్ హీరోయిన్ మధుబాల. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆ సౌందర్యం అజరామరం.. అందుకే ఇప్పటికీ ఆమె మధుబాల క్రేజ్ తగ్గలేదు. అయితే, ఆమె సోదరి కనీజ్ బల్సారానిని ఆమె కోడలు ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కనీజ్ బల్సారాని వయసు 96 సంవత్సరాలు. కనీజ్ బల్సారాకు కొడుకు ఫరూఖ్ అంటే ప్రాణం అందుకే పంచప్రాణాలైన ఆమె అతడితో పాటే విదేశాలకు వెళ్లింది. కానీ కోడలు ఆమెను కనీసం మనిషిగా కూడా చూడకుండా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టింది. అప్పుడప్పుడు కూతురు పర్వీజ్‌ను చూసేందుకు భారత్‌కు వచ్చి వెళ్లేది. తర్వాత భర్త చనిపోవడంతో ఒంటరయ్యింది.ఈ క్రమంలోనే జనవరి 8న కొడుకు కన్నుమూయడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలోనే మధుబాల సోదరి కనీజ్ బల్సారానిని కోడలు తనని ఇంటి నుంచి బయటకు పంపించడంతో చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా న్యూజిలాండ్ నుంచి విమానంలో ముంబయికి బయలుదేరింది. ఈ విషయాన్ని ఆమె కుతురు పేర్విజ్ ఇతరుల నుంచి తెలుసుకున్నారు. అయితే, న్యూజిలాండ్ లోనూ.. ఆక్లాండ్ నుంచి తన తల్లి ముంబయి వస్తున్న క్రమంలో అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని పేర్విజ్ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో కనీసం ఆహారం కూడా అందించలేదని తెలిపారు. ముంబయిలో తాను కనీజ్ బల్సారానిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన సమయంలో.. ముంబయి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు సైతం చేయించుకోవడానికి డబ్బు లేదనీ, ప్రయాణ సమయంలో ఆహారం కూడా ఇవ్వలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు.
ఈ విషయం గురించి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సైతం లేఖ రాశానని పేర్విజ్ తెలిపారు. అయితే, దీని గురించి పూర్తిగా వివరించలేనని మీడియాతో అన్నారు. అలాగే, మా అమ్మకు నా సోదరుడు ఫరూక్ అంటే ఎంతో ఇష్టం. అందుకే తనని విడిచి ఉండలేక 18 సంవత్సరాల క్రితమే నాన్నతో కలిసి తన సోదరుడు ఫరూక్ దగ్గరికి వెళ్లి పోయింది. నా సోదరుడు ఫరూక్‌కి కూడా మా అమ్మ అంటే ఎంతో ఇష్టమని పేర్విజ్ వెల్లడించింది.
