చంద్రుడి ఉపరితలం పై ఉండే మృత్తికను కృత్రిమంగా ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. చంద్రుడి ఉపరితలం ఫై ఉండే హైలాండ్ రెగోలిత్ ను ఈ కృత్రిమ మృత్తికా పోలి ఉంది. అపోలో తీసుకొచ్చిన సాంపిల్స్ కి చాలా దగ్గరగా ఉంది. 

తాజాగా ఈ చంద్ర మృత్తిక ను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు భారత మేధో హక్కుల కార్యాలయం (ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌) ఇస్రో కు పేటెంట్‌ ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి అంటే మే 15, 2014 నాటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉంటాయి.

ఈ ఆవిష్కరణ లో ఇస్రోకు చెందిన ఐ. వేణు గోపాల్‌, ఎస్‌.ఏ. కన్నన్‌, వి. చంద్ర బాబు లతోపాటు.. పెరియార్‌ విశ్వ విద్యాయానికి చెందిన ఎస్‌. అంబజగన్‌, ఎస్‌. అరివళగన్‌, సీ.ఆర్‌. పరమ శివం, ఎం. చిన్న ముత్తు.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి కి చెందిన కె. ముత్తు కుమరన్‌ తదితరులు భాగస్వాములయ్యారు.

భారత్‌ గతంలో తల పెట్టిన చంద్రయాన్ కార్యక్రమంలో విక్రమ్‌ మూన్‌ ల్యాండర్‌ చంద్రుని పై ల్యాండింగ్‌ సమయం లో విఫలమైన సంగతి తెలిసిందే. కాగా, పట్టు వీడని భారత్‌ చంద్రుని పై కాలు మోపేందుకు మరో ప్రయత్నం చంద్రయాన్‌-2 కు సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్‌ లాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రో కు చంద్రుని మీది ఉండే వాతావరణాన్ని కృత్రిమం గా తయారు చేయాల్సి వచ్చింది. 
ఐతే చంద్రుని ఉపరి తలం భూ ఉపరితలం కంటే పూర్తి భిన్నంగా ఉండటం తో కృత్రిమంగా చంద్రుడి ఉపరితలాన్ని సృష్టించి రోవర్‌, ల్యాండర్‌ లను పరీక్షించాల్సి వస్తుంది.

ఈ ప్రయోగాలకు సుమారు 60 నుంచి 70 టన్నుల చంద్ర మృత్తిక అవసరమవుతుంది. చంద్రుని ఉపరితలాన్ని గురించిన శాస్త్రీయ పరిశోధన లకు ఇది చాలా ఆవశ్యకం. భవిష్యత్తు లో భారత్‌ తల పెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా భారీ పరిమాణం లో చంద్ర మృత్తిక ను పోలిన మట్టి అవసరమౌతుంది.

అంతే కాకుండా, భవిష్యత్తు లో చంద మామ పై ఆవాసాలను ఏర్పర్చుకునేందుకు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన భౌతిక, రసాయనిక స్వరూపాన్ని అర్ధం చేసుకోవటం చాలా ముఖ్యం.

ఐతే అమెరికా నుంచి చంద్ర మృత్తిక ను దిగుమతి చేసుకోవటం వీలయినప్పటికీ, ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఈ నేపథ్యం లో చంద్ర మృత్తిక ను దేశీయంగా తయారు చేయటమే పరిష్కారమని శాస్త్ర వేత్తలు భావించారు..