Asianet News TeluguAsianet News Telugu

మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్: ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన తరువాత నేడు మరోసారి ఆర్ధిక వృద్ధి పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన సీఐఐ ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. 

made in India, Made For World: Narendra modi
Author
New Delhi, First Published Jun 2, 2020, 12:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన తరువాత నేడు మరోసారి ఆర్ధిక వృద్ధి పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన సీఐఐ ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. 

భారతదేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం అంత కష్టమైన విషయం కాదని, భారత పరిశ్రమలకు ఆ శక్తి ఉందని, ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజి ఆ దిశగా ముందడుగాని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఒక స్టాండర్డ్, నమ్మదగిన, విశ్వసనీయ సప్లయర్ కోసం ప్రపంచ దేశాలు వెదుకుతున్నాయని, భారత్ ఆ లోటును తీర్చగలదని ప్రధాని అన్నారు. 

మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 

సంస్కరణలంటే ఏవో నాలుగు నిరనయాలు తీసుకోవడం కాదని, ఒక శాస్త్రీయమైన వాగాహనతో ఒక  సాధించే విధంగా ఉండేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోడీ అన్నారు. 

ఇండస్ట్రీ వర్గాల కోసం అనువైన అన్ని రకాల చర్యలను తీసుకున్నామని అన్నారు. 20 లక్షల నిర్భర్ భరత్ ప్యాకేజీని ప్రకటిస్తూ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ సంస్కరణాలయితే తీసుకొస్తున్నామని చెప్పారో వాటన్నింటి గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్ డౌన్ 5 నే అన్ లాక్ 1.0 గా పరిగణిస్తున్నారు.  

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే  విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. 

కంటైన్మెంట్ జోన్లలో పూర్తి  స్ధాయి  లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో  కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి  9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.

 
ఇక జూన్ 8 తర్వాత  సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు.  సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios