ప్రధాని మోదీ రాసిన సరికొత్త గర్భా పాట ‘‘మాడి’’.. మ్యూజిక్ వీడియో విడుదల..
శుభప్రదమైన నవరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘గర్బా’ సాంగ్ రిలీజైంది. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

శుభప్రదమైన నవరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘గర్బా’ సాంగ్ రిలీజైంది. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత వారం రోజుల వ్యవధిలో ఈ గర్బాను రాసినట్టుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ శుభప్రదమైన నవరాత్రులు రాబోతున్న వేళ.. గత వారం రోజులుగా నేను వ్రాసిన ఒక గార్బాను పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. పండుగ లయలు ప్రతి ఒక్కరినీ ఆలింగనం చేయనివ్వండి!.ఈ గర్బాకి గాత్రం, సంగీతం అందించిన మీట్ బ్రోస్(మన్మీత్, హర్మీత్ సింగ్), దివ్యకుమార్‌లకు ధన్యవాదాలు’’- అని ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
మాడీ పేరుతో రాసిన ఈ గర్బా మ్యూజిక్ వీడియో నిడివి.. 4 నిమిషాల 41 సెకన్లు ఉంది. యూట్యూబ్‌లో పోస్టు చేయబడిన ఈ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను, మోదీ అభిమానులను అలరిస్తుంది. ఆ వీడియోలో.. లిరిక్స్- నరేంద్ర మోదీ, మ్యూజిక్- మీట్ బ్రోస్, సింగర్- దివ్య కుమార్, సమర్పణ- ఎంబీ మ్యూజిక్ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తాను రాసిన నూతన గర్బాను విడుదల చేయనున్నట్టుగా మోదీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం ప్రధాని రచించిన 190 సెకన్ల పాటను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా టైమ్‌లైన్‌లో షేర్ చేశారు. ‘‘గర్బో’’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటను ధ్వని భానుశాలి పాడారు. తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. నటుడు-నిర్మాత జాకీ భగ్నాని స్థాపించిన మ్యూజిక్ లేబుల్ అయిన జస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై ఇది విడుదలైంది.
కంపెనీ ఈ పాటను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఎవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ రాసిన కవితా గమనికల నుంచి ప్రేరణ పొందింది. నవరాత్రి సమయంలో గుజరాత్ డైనమిక్ సంస్కృతిని చూడటానికి గర్బో మిమ్మల్ని తీసుకెళ్తుందని కూడా పేర్కొన్నారు.
అయితే ఇందుకు సంబంధించిన పోస్టును ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసిన మోదీ..ధ్వని భానుశాలి, తనిష్క్ బాగ్చి, వారి బృందం, జస్ట్ మ్యూజిక్ బ్యానర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను కొన్నేళ్ల క్రితం వ్రాసిన గార్బాకు సంబంధించి ఈ సుందరమైన ప్రదర్శన కోసం వారికి ధన్యవాదాలు! ఇది చాలా జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. నేను చాలా సంవత్సరాలుగా వ్రాయలేదు. కానీ గత కొన్ని రోజులుగా నేను ఒక కొత్త గార్బాను వ్రాయగలిగాను. దానిని నేను నవరాత్రి సందర్భంగా పంచుకుంటాను. #సోల్ ఫుల్ గర్బా’’ అని మోదీ పేర్కొన్నారు.