పార్లమెంట్‌ చరిత్రలో రెండో సారి ప్రత్యక్ష ప్రసారాలు కట్

M Venkaiah Naidu orders cut of Rajya Sabha TV live
Highlights

పార్లమెంట్ చరిత్రలో ఇవాళ సంచలనం నమోదయ్యింది..రాజ్యసభ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారాలు  నిలిచిపోయాయి

పార్లమెంట్ చరిత్రలో ఇవాళ సంచలనం నమోదయ్యింది..రాజ్యసభ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారాలు  నిలిచిపోయాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా.. విభజన హమీలపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో ఏపీ ఎంపీలు పట్టుబట్టారు. రేపు స్వల్పకాలిక చర్చకు అనుమతిస్తానని ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టం చేసినా. సభ్యులు వినిపించుకోలేదు. మరింతగా రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టగా.. వైసీపీ సభ్యులు తమ తమ  స్థానాల్లో నిలుచుని న్యాయం చేయాలంటే నినాదాలు చేశారు.

సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కూడా ప్రత్యక్ష సమావేశాలు నిలిచిపోయాయి. బిల్లుకు వ్యతిరేకంగా.. అనుకూలంగా సభ్యులు చీలిపోవడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఆందోళనలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అప్పటి లోక్‌సభ స్పీకర్ లైవ్‌ టెలికాస్ట్‌ను నిలుపుదల చేయించారు. ఈ చర్య అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. 
 

loader