దేశంలో ఐక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడానికి రాహుల్ గాంధీ ఇతర పార్టీ నాయకులతో కలిసి 3,570 కిలోమీటర్ల సుదీర్ఘ భారత్ జోడో యాత్రకు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  అన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్‌కు, తనకు పెద్ద బహుమతి అని ఖర్గే పేర్కొన్నారు. 

కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా దాదాపుగా సీడబ్ల్యూసీ సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలో ఉన్నారు. కాంగ్రెస్ నిర్ణయాధికార కమిటీ అయిన సీడబ్ల్యూసీలో 23 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేపై పోటీ చేసిన శశిథరూర్ కమిటీ సభ్యుల్లో లేరు. మనీష్ తివారీ పేరు కూడా ఈ జాబితాలో లేదు.

కన్వెన్షన్ ప్రకారం..ఖర్గే ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సిడబ్ల్యుసి సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. సంప్రదాయం ప్రకారం.. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత, సీడబ్ల్యూసీ రద్దు చేయబడుతుంది. పార్టీ వ్యవహారాలను నిర్వహించడానికి సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లందరూ తమ రాజీనామాలను కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సమర్పించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్‌ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బుధవారం నాడు ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శశిథరూర్‌ను ఓడించిన ఖర్గేకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. సోనియా గాంధీ.. తన స్థానంలో వచ్చిన ఖర్గే కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమన్నారు.

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)తో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇండియా జోడో యాత్రను ఖర్గే బహిరంగంగా ప్రశంసించారు. కాంగ్రెస్‌పై ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారని రాహుల్ గాంధీకి అర్థమైందన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయం భారత్ జోడో యాత్ర అనీ, ఈ యాత్ర కాంగ్రెస్‌కు మరియు ముఖ్యంగా తనకు పెద్ద బహుమతి అని ఖర్గే అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీతో మమేకం అవుతున్నారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లేందుకు పార్టీ సభ్యులు కలిసి రావాలని ఆయన కోరారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్ట కాలన్ని ఎదుర్కొంటుందని తెలుసుననీ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. ప్రజాస్వామ్యాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో అసత్యాలు, విద్వేషాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో కొత్త శక్తిని నింపుతున్నారని ఖర్గే అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ 137 ఏళ్లుగా ప్రజల జీవితాల్లో భాగమైందని, మనం ఎంత మంచి పని చేసినా, మన నాయకుల త్యాగాలు చేసినా ఓటర్లు మాపై కొంత ఆగ్రహంతో ఉన్నారని, అందుకు కారణమైన రాహుల్‌గాంధీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ విషయం అర్థం చేసుకుని భారత పర్యటనకు వెళ్లాడు.దీంతో ప్రతి సమస్యనూ దాటేశాడు. ఈ యాత్రలో ఆయన ఎన్జీవోలు, మేధావులు, జర్నలిస్టులు, రైతులు, కూలీలు, పిల్లలు... ఇలా మధ్యలో ఆయన అందరినీ కలుస్తూ వారిని పలుకరిస్తున్నారని తెలిపారు.

 రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్నారని, లక్షలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. దేశంలో కొత్త శక్తి ఏర్పడుతోందని, ఈ శక్తిని వృథాగా పోనివ్వబోమని, అందరి సహాయం కోరడం కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తవ్యమని ఖర్గే అన్నారు. ఆర్థిక సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, మత సామరస్య సందేశం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు.. మనం ఐక్యంగా ఉండాలని అన్నారు. దేశంలో ఐక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి రాహుల్ గాంధీ ఇతర పార్టీ నాయకులతో కలిసి 3,570 కిలోమీటర్ల పొడవైన భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 7న యాత్ర ప్రారంభమైంది.