భారత్‌లోకి mRNA వ్యాక్సిన్.. అమెరికన్ సంస్థలతో ఒప్పందం దిశగా అడుగులు..?
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్, మందుల కొరతను అధిగమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటోంది. దీనిలో భాగంగా స్వదేశీ, విదేశీ సంస్థలు అభివృద్ధి చేసిన ఔషధాల అనుమతికి సంబంధించిన క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేసింది
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్, మందుల కొరతను అధిగమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటోంది. దీనిలో భాగంగా స్వదేశీ, విదేశీ సంస్థలు అభివృద్ధి చేసిన ఔషధాల అనుమతికి సంబంధించిన క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేసింది.
తాజాగా వైరస్ కట్టడిలో భాగంగా భారత్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు మనదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం లుపిన్ వెల్లడించింది. ఇందుకోసం ఇతర తయారీ సంస్థలతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా కొవిడ్ చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్ లాంటి ఔషధాలను కూడా దేశానికి తీసుకురావాలని లుపిన్ భావిస్తోంది. mRNA వ్యాక్సిన్లను దేశానికి తీసుకురావాలని భావిస్తున్నామని.. ప్రస్తుతం ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ కంపెనీల్లో ఏదో ఒకదానితో కలిసి పనిచేస్తామని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా స్పష్టం చేశారు.
Also Read:ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించింది.. ఓ నర్సు విజయగాథ..
కాగా, ప్రపంచంలో ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేసిన వాటిలో ఫైజర్, మోడెర్నా సంస్థలు ముందున్నాయి. ఈ రెండింటిలో ఒకదానితో లుపిన్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి. దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను ఇండియాకు తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.
మరోవైపు బాక్రిసిటినిబ్ ఔషధాన్ని మనదేశంలోకి తెచ్చేందుకు లుపిన్ ఇప్పటికే ఎలీ లిల్లీ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని రెమ్‌డెసివిర్‌తో పాటు కొవిడ్ రోగుల చికిత్సలో వినియోగిస్తారు. రాబోయే రెండు నెలల్లో బాక్రిసిటినిబ్‌ను లుపిన్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.