భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్, చైనాల ఆర్మీ అధికారులు నేడు సమావేశమవనున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల తరుఫున లెఫ్టనెంట్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొననున్నారు. 

భారత్, చైనాల మధ్య ఎల్ఏసి విషయంలో సరైన విభజన ఒప్పందం లేనందున ఇరు వైపులా తరుచుగా ఆ విషయంలో చిన్న చిన్న ఘర్షణలు సర్వసాధారణం. కానీ ఇరు వైపులా అధికారులు కూర్చొని ఆ విషయాన్నీ తెగ్గొడుతుంటారు. ఈ సారి వివాదం నెలకింద తలెత్తినప్పటికీ... ఇంకా దానికి ఒక ముగింపు కలగలేదు. ఈసారి అధికారుల చర్చల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేలా కనబడుతుంది. 

చిన్న చిన్న మీటింగులు జరిగినప్పటికీ... అవి ఎటువంటి సంపూర్ణ పరిష్కారాన్ని కానీ, ఈ వివాదానికి ఒక ఫుల్  కలిగించడంలో కానీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో హై లెవెల్ చర్చలకు ఇరు దేశాలు కూడా ముందుకొచ్చాయి. భారత్ తరుఫున ఈ చర్చల్లో లెఫ్టనెంట్ జనరల్ హరిందర్ సింగ్ పాల్గొననున్నారు. 

ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ గా పిలువబడే 14 కార్ప్స్ రెజిమెంట్ కి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. భారత ఆర్నీ నార్తర్న్ కమాండ్ కి చెందిన విభాగం ఇది. దీనికి కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు హరిందర్ సింగ్. 

గత అక్టోబర్లో ఈ విభాగానికి చీఫ్ గా బాధ్యతలను చేపట్టే ముందు ఆయన భారత అథిమిలో అనేక కీలక పదవుల్లో సేవలందించారు. మిలిటరీ ఇంటలిజెన్స్ కి డైరెక్టర్ జెనెరిక్ గా కూడా వ్యవహరించారు. మిలిటరీ ఆపరేషన్స్ విభాగానికి, మిలిటరీ ఆపరేషనల్ లాజిస్టిక్స్, స్ట్రాటజిక్ మూవమెంట్ విభాగానికి కూడా డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించాడు. 

జమ్మూ కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్స్ లో పాల్గొన్న అనుభవం హరిందర్ సింగ్ సొంతం. ఆయన భారత్ తరుఫున ఆఫ్రికాలో ఐరాస  పీస్ కీపింగ్ మిషన్ లో కూడా పనిచేసారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ విషయాలంటేనే వేలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. తాజాగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులు టెన్షన్ గా మారడంతో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసాడు. 

"భారత్, చైనాలు ఇరు దేశాల మధ్య కూడా సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా  ,ఇప్పటికే ఈ విషయాన్నీ ఇరు దేశాలకు కూడా తెలిపాము. ధన్యవాదాలు" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. 

ఈ విషయంలో భారత్ తో ట్రంప్ మాట్లాడినప్పటికీ... ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మాత్రం భారత్ అంగీకరించలేదు. మొన్న ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన మోడీ చైనా సరిహద్దు విషయంలో విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.