New Army Vice Chief : తదుపరి ఆర్మీ వైస్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు  (BS Raju) బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌గా  వ్య‌వ‌హ‌రిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్మీ చీఫ్‌గా పదోన్నతి పొందనున్నారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజు ప్రస్తుతం మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.   

New Army Vice Chief :  నూత‌న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు (BS Raju) నియమితుల య్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా తాజాగా ప‌దోన్న‌తి పొందారు. దీంతో అత‌ని స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ గా.. BS Raju వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్ర‌స్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న‌ జనరల్ మనోజ్ నరవానే నుండి ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.

 లెఫ్టినెంట్ జనరల్ రాజు గతంలో శ్రీనగర్‌లో 15 కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం మిలటరీ ఆపరేషన్స్‌ డీజీ(DGMO)గా లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మే 1న తదుపరి ఆర్మీ వైస్ చీఫ్‌ గా బగ్గవల్లి సోమశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.

లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు సైనిక్ స్కూల్ బీజాపూర్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. అతను డిసెంబర్ 15, 1984న JAT రెజిమెంట్‌లో నియమించబడ్డాడు. 38 ఏళ్ల సర్వీసులో జనరల్ రాజు... వెస్ట్రన్ థియేటర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో 'ఆపరేషన్ పరాక్రమ్' సమయంలో తన బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు. 

జమ్మూ కాశ్మీర్‌ లో, నియంత్రణ రేఖ వెంబడి ఉరీ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. అలాగే కశ్మీర్ లోయలోని 15వ కార్ప్స్‌కి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్‌కి నాయకత్వం వహించిన ఘనత ఇత‌ని సొంతం. భూటాన్‌ లో భారత సైనిక శిక్షణా బృందానికి కమాండెంట్‌ గా కూడా బీఎస్ రాజు పనిచేసినట్లు సైన్యం అతని నియామకంపై ఒక ప్రకటనలో తెలిపింది.


క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ కూడా అయిన బీఎస్ రాజు.. ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్ ( UNOSOM-II)లో భాగంగా సోమాలియాలో ఆపరేషల్ ఫ్లయింగ్‌ను నిర్వహించారు. అతను JAT రెజిమెంట్ యొక్క కల్నల్ కూడా. లెఫ్టినెంట్ జనరల్ రాజు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో తన నేషనల్ డిఫెన్స్ కాలేజీ (NDC) చదివారు. అలాగే.. యునైటెడ్ స్టేట్స్‌లోని మోంటెరీలోని నావల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి కౌంటర్ టెర్రరిజంలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందాడు. మరోవైపు,బీఎస్ రాజు తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా నియమితులైన నేపథ్యంలో..ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కతియార్ సైన్యం తదుపరి DGMOగా నియమితులయ్యారు.